జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలుగు సాహిత్యం విలువను మనం తెలుసుకుంటే గొప్ప సినిమాలు తీయడం సాధ్యమవుతుందని పవన్ అన్నారు. ఎన్టీఆర్, చరణ్ లా నేను గొప్ప డ్యాన్స్ చేయలేకపోవచ్చని ప్రభాస్, రానాలా బలమైనపాత్రలు పోషించలేకపోవచ్చని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. సినిమా అంటే నాకు ప్రేమ అని సమాజం అంటే బాధ్యత అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీ ఏ కుటుంబానికి చెందినది కాదని ఆయన తెలిపారు. నా దృష్టిలో హీరో అంటే ఎప్పుడూ చిరంజీవే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నటుడు కావాలని రాజకీయాల్లో ఉంటానని ఎప్పుడూ ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. సముద్రఖనిది మన భాష, యాస కాకపోయినా ఆయన తెలుగులో స్క్రిప్ట్ చదువుతూ కనిపించారని పవన్ తెలిపారు. చిరంజీవి తమ్ముడిని అని ఏదీ సులభంగా తీసుకోలేదని పవన్ తెలిపారు. సాయితేజ్ తో కలిసి నటించానని సాయితేజ్ రియల్ లైఫ్ లో జరిగిన ఘటనలకు, ఈ సినిమాకు సంబంధం ఉందని పవన్ పేర్కొన్నారు.
సాయితేజ్ కు ప్రమాదం జరిగిన సమయంలో ఆంబులెన్స్ ను పిలిపించిన అబ్దుల పర్హాన్ కు కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. త్రివిక్రమ్ నా ఫ్రెండ్ అయినందుకు ఆనందిస్తున్నానని త్రివిక్రమ్ ను స్పూర్తిగా తీసుకుని కొత్త రచయితలు రావాలని పవన్ పేర్కొన్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ మరో స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
సాయితేజ్ మాట్లాడుతూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు.మామయ్యతో నాకు ఉన్న కెమిస్ట్రీని బ్రో సినిమాలో అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారని సాయితేజ్ వెల్లడించారు. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో (Pawan Kalyan) పవన్, సాయితేజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.v
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!