పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలతో కూడా బిజీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మేము ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు వ్యక్తిగత విషయాల గురించి నీచంగా మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. అవినీతి లేకుండా వైసీపీ నేతలు పాలన సాగిస్తున్నారంటే నమ్మాలా? అని పవన్ పేర్కొన్నారు. తాను మీ ఇంటి ఆడవాళ్లను గౌరవిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. పాలకులతో తనకు ఎప్పుడూ సమస్యేనని పవన్ కళ్యాణ్ అన్నారు.
పాలకులు చేసే తప్పులకు ప్రజలను శిక్షించవద్దని పవన్ చెప్పుకొచ్చారు. ఆదిలోనే వైసీపీ పాలన ఏ విధంగా ఉందో తెలిసిపోయిందని పవన్ కామెంట్లు చేశారు. ప్రజల బాగు కొరకు తాను పాలిటిక్స్ లోకి వచ్చానని అడ్డగాడిదలతో తిట్లు తినడానికి తనకేమైనా సరదానా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తనకు పౌరుషం ఎక్కువని ప్రజల కొరకు పౌరుషాన్ని తగ్గించుకుంటానని పవన్ పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో టీడీపీ తరపున చంద్రబాబు తన ఆఫీస్ కు వచ్చారని పవన్ కామెంట్లు చేశారు.
ఎకరం లక్ష రూపాయలు ఉన్న సమయంలో తన సంపాదన కోటి రూపాయలు అని పవన్ అన్నారు. అయినప్పటికీ తాను ఎప్పుడూ డబ్బు వెంట పడలేదని పవన్ చెప్పుకొచ్చారు. పేదరికం, అవినీతి తనకు వర్గ శత్రువు అని పవన్ అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు పోయి 15 సీట్లు రావచ్చని పవన్ పేర్కొన్నారు. నాతో పెట్టుకుంటే తాట తీస్తానని నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!