రాజకీయాల పరంగా ఆలోచనలు, ఉద్దేశాలు వేరయినా మా అనుబంధంలో ఎటువంటి మార్పు లేదు.. ఉండదు.. అని మెగాస్టార్, పవర్ స్టార్ ఎప్పటినుండో చెప్పుకొస్తున్నా.. అభిమానులకి అది సరిపోలేదని తెలుస్తూనే ఉంది. కానీ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ.. అన్నయ్య అడిగారని ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక ప్రీ రిలీజ్ వేడుకలో కూడా మెగా బ్రదర్స్ అభిమానులకి కనువిందు చేశారు. ఇక దీపావళి రోజున ఇరు కుటుంబసభ్యులు కలిసి దీపావళి జరుపుకోవడంతో మెగా అభిమానుల సంతోషానికి ఆకాశమే హద్దు అన్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ వేడుకలో పవన్ తో పాటు భార్య అన్నా లెజినోవా అలాగే.. రేణు వారసులు అఖీరా- ఆద్యలతో పాటు అన్నాలెజినోవా వారసులు పోలెనా- మార్క్ శంకర్ ఇద్దరూ సందడి చేయడం విశేషం. ఇక ఈ వారసుల మధ్య కూడా మంచి అనుబంధం నెలకొంది అని తాజాగా నెట్లో హల్చల్ చేస్తున్న ఫోటోలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఏమైనా అభిమానులకు మాత్రం ఇది కన్నుల పండగే అనడంలో సందేహం లేదు.
1
2
3
4
5
View this post on Instagram
About last nyt #PawanKalyan #akiranandan #aadhya ❤️😻😻 #niharika #niharikakonidela
A post shared by Niharika Konidela Fc (@niharika_konidela) on
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!