హైదరాబాద్, శిల్పకళా వేదికలో ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” ‘హరిహర వీరమల్లు’ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసినప్పటికీ.. వర్షం వంటి ఇతర కారణాల వల్ల ఇబ్బంది ఉంటుందని ఇలా సింపుల్ గా శిల్పకళావేదికలో చేస్తున్నాం. ఇందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
సినీ పరిశ్రమలోనే కాదు రాజకీయాల్లో కూడా నాకు ఈశ్వర్ వంటి మంచి స్నేహితులు దొరికారు. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు.. అందరి హీరోల సినిమాల టికెట్లు వందల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ మాత్రం 10 రూపాయలు ఉండేది. అప్పుడే మీకు చెప్పా.. మనల్ని ఎవడ్రా ఆపేది అని. ఇది రికార్డుల కోసమో, కలెక్షన్స్ కోసమో కాదు. డామ్న్ గట్స్. బ్రహ్మానందం గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అనుకోకుండా హీరో అయ్యాడు, ఎప్పుడూ రికార్డ్స్ కోసం ట్రై చేయలేదు..సగటు మనిషిగా బ్రతకాలని కోరుకున్నా. కొందరు నన్ను తిడతా ఉంటారుగా.. రీమేక్స్ చేస్తుంటానని.. మనకి పెద్ద దర్శకులు ఎవరూ లేరు.
ఫాస్ట్ గా సినిమాలు చేయాలంటే రీమేక్స్ నాకు ఆప్షన్. సమాజం పట్ల నాకు బాధ్యత ఉంటుంది. కాబట్టి.. మంచి కథలు రీమేక్స్ చేశాను. నాకు పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. వేరే ఆప్షన్ లేదు. నేను ప్లాపుల్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను ‘జల్సా’ తో ఆదుకున్నాడు. అస్తమానం ఓజి ఓజి అంటారేంటి. ఇది కూడా మన సినిమానే. టికెట్ రేట్లు లేని టైంలో ‘భీమ్లా నాయక్’ ని చూశారు. అలాగే దానికి మించిన సత్తా ‘హరిహర వీరమల్లు’ లో ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.