తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో భీమ్లా నాయక్ రిలీజవుతోంది. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు టికెట్లు దొరకడం సులువు కాదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లలో భీమ్లా నాయక్ ప్రదర్శితం కానుండగా కొన్ని థియేటర్లలో మాత్రం వలిమై సినిమా ప్రదర్శితం కానుంది. వలిమై సినిమాకు అబవ్ యావరేజ్ టాక్ రాగా ఈ సినిమా భీమ్లా నాయక్ కు పోటీనిచ్చే పరిస్థితులు లేవు.
అయితే ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలవుతూ ఉండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, ఏపీ డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడుతున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ అభిమానులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మాచర్ల ప్రాంతంలో ఒకచోట గేటుకు డబ్బా కట్టిన ఫ్యాన్స్ పవన్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా వాళ్లకు చేతనైన సహాయం చేయడానికి మాచర్ల పవన్ ఫ్యాన్స్ తరపున విరాళాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భీమ్లా నాయక్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా పలు ప్రాంతాలలో పవన్ అభిమానులు ధర్నా చేశారు. బెనిఫిట్ షోస్ కావాలని పలు ప్రాంతాల్లో అభిమానులు నిరసనకు దిగారు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భీమ్లా నాయక్ రిలీజైన తర్వాత పవన్ అభిమానులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.
అధికారులు కొన్ని సినిమాల విషయంలో ఒక విధంగా మరికొన్ని సినిమాల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ సమయంలో మాత్రమే ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పుష్ప, అఖండ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఏపీలో ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేదు. ఏపీలో భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూడాలి. ఈ పరిస్థితుల్లో కూడా ఏపీలో భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ అయితే అది రికార్డేనని చెప్పాలి.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!