భీమ్లా నాయక్ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాల్సి ఉన్నా ఆ సినిమా రిలీజ్ సమయంలోనే కరోనా కేసులు పెరగడంతో ఆ సినిమా రికార్డులు సాధించలేదు. అయితే భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆ లోటు తీరేలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గతంతో పోలిస్తే టికెట్ రేట్లు పెరిగాయి.
భీమ్లా నాయక్ సినిమాకు ఎక్కువ టికెట్ రేటు ఉన్నా ఫ్యాన్స్ కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేసే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. అయితే భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్లు బుక్ మై షోను బ్యాన్ చేయడంతో పవన్ అభిమానులకు కష్టాలు మొదలయ్యాయి. ఫస్ట్ డే టికెట్ల కోసం భీమ్లా నాయక్ ప్రదర్శించబడే థియేటర్లకు వెళ్లిన అభిమానులకు టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయనే సమాధానం వినిపిస్తోంది. మెయిన్ థియేటర్లతో పాటు సాధారణ థియేటర్లలో కూడా ఇదే సమాధానం వినిపిస్తుండటంతో అభిమానులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
అదే సమయంలో రిలీజ్ రోజున బ్లాక్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయంటూ ప్రచారం జరుగుతోంది. పవన్ సినిమా అంటే అభిమానులు బ్లాక్ లో టికెట్లను కొనుగోలు చేయడానికి వెనుకాడరు. అయితే పవన్ పై అభిమానాన్ని థియేటర్ల యాజమాన్యాలు ఈ విధంగా క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆన్ లైన్ లో భీమ్లా నాయక్ టికెట్లకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో ఎక్కడ టికెట్లు అందుబాటులో ఉన్నాయో తమకు అర్థం కావడం లేదని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తమ బాధను అర్థం చేసుకుని భీమ్లా నాయక్ మేకర్స్ రంగంలోకి దిగి సమస్యకు పరిష్కారం చూపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వైరల్ అవుతున్న వార్తలపై భీమ్లా మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏపీలో మాత్రం బుక్ మై షోలో టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.