Pawan Kalyan: లడ్డు ఇష్యు.. కార్తీపై పవన్ కామెంట్స్ వైరల్.!
- September 24, 2024 / 12:39 PM ISTByFilmy Focus
తిరుమల లడ్డు తయారీ విషయంలో కల్తీ జరిగిందనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కదిలించింది. ఈ వ్యవహారం చుట్టూ రాజాకీయాలు కూడా చోటు చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి కుట్రలు జరిగాయని టీడీపీ పార్టీ ఆరోపిస్తే…’మీరు అధికారంలోకి వచ్చాకే ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది’ అంటూ వైసీపీ కార్యకర్తలు వ్యంగ్యాస్త్రాలు వదలడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ విషయమై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చాలా సీరియస్ అయ్యారు.
Pawan Kalyan

సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు గాను ఆయన ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆయన బెజవాడ కనక దుర్గమ్మ గుడికి వెళ్లడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ పవన్ చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన ‘తిరుమల లడ్డు గురించి జోక్స్ వంటివి వేయొద్దు.

నిన్న ఓ సినిమా ఈవెంట్లో కూడా ‘లడ్డూ సెన్సిటివ్ టాపిక్’ అంటూ జోకులు వేస్తున్నారు. దయచేసి అలా లడ్డూను కించపరచొద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. జరిగిందేంటంటే.. నిన్న కార్తీ (Karthi) నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో భాగంగా యాంకర్.. హీరో కార్తీని ‘లడ్డూ కావాలా నాయనా’ అంటూ ఆట పట్టించింది.

దీనికి కార్తీ.. ‘లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్ ఇప్పుడు. దాని జోలికి వెళ్లొద్దు’ అంటూ కార్తీ సరదాగా పలికాడు. దానికి అక్కడ ఉన్నవారు అంతా నవ్వుకున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్.. పరోక్షంగా ఇలా ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో మొన్న ట్విట్టర్లో కామెంట్ చేసిన ప్రకాష్ రాజ్ (Prakash Raj) పై కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు.
లడ్డూపై హీరో కార్తి చేసిన వ్యాఖ్యలపై ఫైరయిన పవన్ కళ్యాణ్!#Karthi #PawanKalyan pic.twitter.com/sCPgpTN6Ja
— Filmy Focus (@FilmyFocus) September 24, 2024

















