Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

‘అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు బాధ వచ్చింది’ అన్నట్టు… ఈ మాట ఇండస్ట్రీ జనాలకు కరెక్ట్ గా సరిపోతుంది. సినిమా తీసే టైంలో టెన్షన్ పడకుండా.. జనాలు సినిమా చూసిన వాళ్ళు బాలేదు అంటే.. వాళ్లపై మండి పడటం కామన్ అయిపోయింది. వాస్తవానికి రివ్యూలు అనేవి ఇప్పటివి కాదు.. దాదాపు 40 ఏళ్ళ నుండి ఉన్నవే. కానీ ఫిలిం మేకర్స్.. ఈ మధ్య తమ ప్లాప్ సినిమాలకు రివ్యూయర్స్ ని నిందించడం ఫ్యాషన్ అయిపోయింది. వెబ్ సైట్ రివ్యూలు ఎలాగూ ఆలస్యంగా వస్తాయి.

Pawan Kalyan

సో మేకర్స్ కంప్లైంట్ వాటిపై కాదు. కొంతమంది యూట్యూబర్స్ సినిమా చూసిన వెంటనే..దాని గురించి రివ్యూ ఇస్తున్నారు. పాజిటివ్ గా ఇస్తే ఎవ్వరూ చూడరు అనుకుంటారో ఏమో కానీ నెగిటివ్ పాయింట్స్ నే ఎక్కువగా హైలెట్ చేస్తూ వస్తున్నారు. అందువల్ల జనాలు సినిమాలు చూడటానికి థియేటర్ కి రావడం లేదు అనేది మేకర్స్ చేసే కంప్లైంట్. చివరికి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో కూడా రివ్యూయర్లపై కంప్లైంట్ చేయడం షాకిచ్చే అంశం.


నిన్న జరిగిన ‘ఓజి’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ ‘సినిమా చూస్తున్నప్పుడే ఫోన్ తీసి.. ఇది బాలేదు.. ఇది బాగుంది’ అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా రివ్యూల విషయంలో కూడా నేను బాధపడ్డాను. రివ్యూయర్లు సినిమాని చంపేస్తున్నారు. మా ఉసురు మీకు తగులుద్ది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇవి నిజంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్సా లేక.. మేకర్స్ ఏమైనా ఈ పాయింట్ గురించి మాట్లాడమని చెప్పారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పుడు బాగున్న సినిమాకి ఆడియన్స్ అన్యాయం చేయడం లేదు.

‘లిటిల్ హార్ట్స్’ ‘కిష్కింధపురి’ ‘మిరాయ్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా బాగా కలెక్ట్ చేశాయి. వాటికి కూడా మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.. అయినా ఎందుకు నిలబడ్డాయి.? ఎందుకంటే.. వాటికి టికెట్ రేట్లు ఏమీ పెంచలేదు. ఆడియన్స్ కి అందుబాటులోనే టికెట్ రేట్లు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు సైతం నచ్చలేదు. వాటి రివ్యూలతో బాధపడినట్లు పవన్ చెప్పడం కరెక్ట్ కాదు. ‘ఓజి’ కి ఎక్కువ శాతం బాగుంది అనే చెప్పారు. నెగిటివ్ రివ్యూల ప్రభావం ఉంటే రికార్డు ఓపెనింగ్స్ రావు.

కానీ కలెక్షన్స్ రావడం లేదు అంటే.. అది కచ్చితంగా టికెట్ రేట్ల ప్రభావం వల్లనే. ఇది పవన్ కళ్యాణ్ గమనించాలి. తన ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించేశారు అనే బాధతో ‘హరిహర వీరమల్లు’ ‘ఓజి’ సినిమాలకు టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. అందువల్ల మొదటికే మోసం వచ్చింది. ‘ఓజి’ పాజిటివ్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ సాధించడానికి కష్టపడుతుంది అంటే.. ఎక్కువ టికెట్ రేట్లు ఉండటం అనే సత్యాన్ని పవన్ కళ్యాణ్ కూడా గమనించకపోవడం బాధాకరం. దానికి రివ్యూయర్లు కారణం అనడం హాస్యాస్పదం.

 

‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus