Hari Hara Veera Mallu Teaser: ‘హరిహర వీర మల్లు’… పవర్ గ్లాన్స్ అదిరిపోయిందిగా..!

  • September 2, 2022 / 11:53 AM IST

:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. అతను నటిస్తున్న ‘హరిహర వీర మల్లు’ చిత్రం నుండి పవర్ గ్లాన్స్ పేరుతో ఓ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. నిజానికి సాయంత్రం విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఎందుకో కాస్త ముందుగానే విడుదల చేశారు. ‘మెడ‌ల్ని వంచి, క‌థ‌ల్ని మార్చి, కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడే.. తెలుగోడు’ అంటూ వచ్చే ప‌వ‌ర్ ఫుల్ బిజిఎంతో ఈ గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉందని చెప్పాలి.

అలాగే ప‌వ‌న్ కళ్యాణ్ స్క్రీన్ ప్ర‌జెన్స్ కూడా కేక పుట్టించడం గ్యారెంటీ అనే చెప్పాలి. కుస్తీలో ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపిస్తూ చివర్లో తొడగొట్టడం అనేది అభిమానులకు ఫుల్ ఫీస్ట్. ఈ గ్లిమ్ప్స్ విషయంలో కీర‌వాణినే ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఇలాంటి చిత్రాలకు పని చేసి బాగా ఇందులో గ్రిప్ సంపాదించినట్టు ఉన్నాడు అనిపిస్తుంది. ఇక 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు క్రిష్.

ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ. ఇండియన్ సినిమాల్లో ఇప్ప‌టివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్. ఆల్రెడీ 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం కానుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియజేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రూపొందుతుంది.

ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్‌ సరసన నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా న‌ర్గీస్ ఫ‌క్రి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న పవర్ గ్లాన్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus