4 ఏళ్ళ క్రితం విశాఖ పట్టణంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఓ చిన్నారిని కలిసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.పవన్ ఆ పాపని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఆ చిన్నారి పేరు రేవతి.ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆమెకు కండరాల వ్యాధి ఉంది. కండరాల్లో పట్టు లేక ఆమె బాధపడుతుండేది. జురోజుకు ఆమె కండరాలు క్షీణించిపోతాయని డాక్టర్లు చెప్పినట్టు ఆమె తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ కు తెలిపారు.
రోజూ ఫిజియోథెరపీ నిర్వహించకపోతే ఆమె కండరాలు బిగుసుకుపోతాయని కూడా పవన్ కు చెప్పి వాపోయారు. దీంతో పవన్ చలించిపోయారు. రేవతి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వారికి ఆర్థిక సాయం చేశారు. దీంతో మైసూరు ఆశ్రమానికి రేవతిని షిఫ్ట్ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగా రేవతి కన్నుమూసింది. ఆ పాప మరణవార్త తెలిశాక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు విలవిలలాడిపోతున్నారు. అందరినీ విషాదంలోకి నెట్టేసింది ఈ వార్త.
రేవతి మరణానికి చింతిస్తూ పవన్ అభిమానులు ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఎంతో మంది చిన్నారులను ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పాపని కూడా అదే విధంగా కాపాడాలని ప్రయత్నించారు కానీ.. రేవతి ప్రాణం నిలబడలేదు. రేవతి తల్లిదండ్రులు అలాగే ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?