”ఇరవై సంవత్సరాల వయసులో నేను కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే… మా అమ్మ నన్ను ఒకరి దగ్గరికి పంపించి తలుపు వేసింది. ఆ వ్యక్తి నాతో గంటసేపు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నాకు లైఫ్ అంటే అర్థమైంది. కెరీర్ విలువ తెలిసింది. నా కెరీర్ కు ఆయనే ఇనిస్పిరేషన్. అయన మరెవరో కాదు బాబాయ్ పవన్ కళ్యాణ్….”
తన కెరీర్ కు బాబాయ్ పవన్ కళ్యాణే ఇనిస్పిరేషన్ అన్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫెస్ట్ లో రాంచరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచరణ్ కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడారు. తాను కాలేజ్ డేస్ లో ఎలా ఉండేవాడో వారితో షేర్ చేసుకున్నాడు. అంతే కాదు… ప్రేమ, కెరీర్, ఫ్యామిలీ గురించి ఎమోషనల్ గా మాట్లాడాడు. రాంచరణ్ స్పీచ్ విద్యార్థుల కేరింతలు విజిల్స్ మధ్య ఉల్లాసంగా సాగింది.