Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్లీ తెలుగులోకి రాబోతున్న ఆ డైరెక్టర్ ఎవరంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేస్తున్న స్టార్ హీరో.. చేతిలో ఉన్నవి ఎప్పుడు పూర్తవుతాయో కానీ ఆయన మాత్రం ఒకదాని తర్వాత ఒకటి అనే ఆర్డర్‌లో కాకుండా.. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు లైనప్ చేస్తున్నారు.. 2024 సార్వత్రిక ఎన్నికలకు జనసేనను మరింత బలోపేతం చేయడానికి.. జనాల్లోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికలు వేసుకుంటూనే వీలైనంత త్వరగా కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయాలనేది పవన్ ఆలోచన.. హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీరమల్లు’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది..

తర్వాత ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, ఇంతలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ‘వినోదాయ సీతం’ రీమేక్ కమిట్ అయ్యారు.. సముద్రఖని సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.. దీని కోసం 20 నుండి 22 రోజుల పాటు పని చేయబోతున్నానని.. రోజుకి రూ. 2 కోట్ల చొప్పున రూ. 40 నుంచి 45 కోట్ల వరకు తీసుకుంటున్నానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.. ఆమధ్య సురుందర్ రెడ్డితో అనౌన్స్ చేసిన సినిమా సంగతి తెలియదు..

ఇదిలా ఉంటే పవన్ ఇప్పుడు మరో పాన్ ఇండియా డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారనే వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.. ఆర్.చంద్రు అనే పాపులర్ కన్నడ దరక్శుడు పవన్‌తో మూవీ కోసం ప్రయత్నిస్తున్నాడట.. ఈ శుక్రవారం (మార్చి 17న) విడుదలైన ఉపేంద్ర పాన్ ఇండియా ఫిలిం ‘కబ్జ’ తీసింది చంద్రునే.. కన్నడలో ఫస్ట్ మూవీ ‘తాజ్ మహల్’ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడాయన..

తర్వాత శివ రాజ్ కుమార్‌తోనూ ఓ మూవీ చేశాడు.. ‘చార్మినార్’ అనే శాండల్ వుడ్ మూవీని తెలుగులో సుధీర్ బాబు హీరోగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే పేరుతో రీమేక్ చేయగా చంద్రునే డైరెక్ట్ చేశాడు.. ఉపేంద్రతో ‘బ్రహ్మ’, ‘ఐ లవ్ యు’ సినిమాలు చేశాడు.. ‘కబ్జ’కి మిక్స్డ్ టాక్ వస్తోంది.. చంద్రు, పవన్ ఇమేజ్‌కి సరిపడే కథ రెడీ చేశాడని, త్వరలోనే పవర్ స్టార్‌కి కథ వినిపించనున్నాడని టాక్..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus