పవన్ ని సీఎంగా చూడాలనుకుంటున్న వారికి ఇది నచ్చడం లేదు
- September 3, 2020 / 09:10 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్న సోషల్ మీడియా వేదికగా భారీగా సందడి చేశారు. తమ అభిమాన హీరోపుట్టినరోజును ఘనంగా ముగించారు. అనేక సేవాకార్యక్రమాలు పవన్ పేరిట ఫ్యాన్స్ నిర్వహించారు. ఇక రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పవన్ కి బర్త్ డే విషెష్ చెప్పడం జరిగింది. కుప్పంలో ఫ్యాన్స్ కి ఆ ప్రమాదం జరగకపోయి ఉంటే వేడుకలు మరింత ఆడంబరంగా ఉండేవి. కాగా ఎన్నడూ లేని విధంగా నిన్న పవన్ నుండి నాలుగు అప్డేట్స్ వచ్చాయి. పవన్ 25ఏళ్ల కేరీర్ లో జరగని వింత 2020లో జరిగింది.
వకీల్ సాబ్ మోషన్ పోస్టర్, క్రిష్, హరీష్ శంకర్ మూవీల ప్రీలుక్స్ తో పాటు దర్శకుడు సురేంధర్ రెడ్డితో చేయనున్న కొత్త మూవీ ప్రకటన కూడా జరిగింది. ఫ్యాన్స్ ఊహించిన దానికి నాలుగు రెట్ల సంతోషం పవన్ తన పుట్టినరోజునాడు పంచాడు. ఐతే పవన్ ఫ్యాన్స్ అందరూ వరుస చిత్రాల ప్రకటనపై ఆనందంగా లేరు. సురేంధర్ రెడ్డితో పవన్ 29వ మూవీ ప్రకటించడం కొందరికి షాక్ ఇచ్చింది. దానికి కారణం 2024లో రానున్న ఎన్నికలే. ప్రకటించి మూడు చిత్రాలు పూర్తి చేయడానికే సమయం లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇంకా మూడున్నరేళ్ల సమయం మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. వకీల్ సాబ్ మినహాయిస్తే మరో మూడు చిత్రాలు పవన్ పూర్తి చేయాల్సివుంది. ఎన్నికలు దగ్గర పడేవరకు సినిమాలు చేసుకుంటే ప్రజల నమ్మకాన్ని పొందడం కష్టం. అలాగే పార్టీని, కేడర్ ని బలోపేతం చేసుకోవడానికి సమయం ఉండదు. పవన్ ని సీఎంగా చూడాలని అనుకుంటున్న వారికి పవన్ వరుస చిత్రాల ప్రకటన నచ్చడం లేదు.
Most Recommended Video
తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

















