2019 ఎన్నికలు ముగిసాయి. ఇప్పటి వరకూ రాజకీయాల్లో బిజీగా గడిపారు కాబట్టి ‘జనసేన’ అగినేత పవన్ కళ్యాణ్ ను అభిమానులు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఆగట్లేదు. ‘ఇక పార్టీ అభివృద్ధి పనుల్లోనే బిజీగా గడుపుతాను.. సినిమాలు చెయ్యను’ అని పవన్ బలంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ గడ్డం పెంచి స్వామిజీలా ఉన్నటైంలో అభిమానులు ఒత్తిడి చేయలేదు. కానీ ఇప్పుడు అమెరికాలో జరగనున్న తానా సభల కోసం పవన్ కళ్యాణ్ గడ్డం తీసేసి మంచి స్టైలిష్ గా తయారయ్యాడు.

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫొటోలో పవన్ జీన్స్ ప్యాంట్ వేసుకుని సింపుల్ టీ షర్ట్ తో కనిపించాడు. అంతే ఇక అభిమానుల రచ్చ మళ్ళీ మొదలైంది. ఒక్క పవన్, మెగా అభిమానులు మాత్రమే కాదు.. మిగిలిన హీరోల అభిమానులు కూడా ‘ఆయన ఒక సినిమా చేయాలని’ కామెంట్లు పెడుతుండడం విశేషం. ఇక డై హార్డ్ ఫ్యాన్స్ అయితే.. ‘ఎందుకు అన్న ఇలా ఊరిస్తావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక తానా సభల కోసం బయల్దేరాడు పవన్. ఎయిర్ పోర్ట్ లో ఆయన్ని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోయారు.

.

