పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో ఖరారైన కథానాయికలు
- December 2, 2016 / 12:10 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” చిత్రీకరణలో బిజీగా ఉన్న పవన్ తర్వాతి సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్రివిక్రమ్ కూడా తమ సినిమా కోసం తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ తో కలిసి పాటలను స్వరపరుచుకుంటున్నారు. “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఖుషి సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని తీసుకున్నారు.
టెక్నీషియన్లతో పాటు ఆర్టిస్టుల సెలక్షన్ కూడా డైరక్టర్ పూర్తి చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నారు. ప్రధాన కథానాయికగా నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన త్రివిక్రమ్, తాజాగా రెండో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయెల్ ని తీసుకున్నారు. ఈమె నాని ‘మజ్ను’ చిత్రంతో ఆకట్టుకొంది. ప్రస్తుతం ‘ఆక్సిజన్’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















