పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాబోయే ఎన్నికల కోసం తన పార్టీని బలోపేతం చేయడానికి పొలిటికల్ టూర్లు వేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అయినప్పటికీ పార్టీ అవసరతల కోసం డబ్బులు కావాలి. అందుకోసమే సినిమాల్లో నటిస్తున్నట్టు తానే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఓ పక్క ‘వినోదయ సీతమ్’ రీమేక్ లో తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. ఏప్రిల్ మొదటి వారం నుండి హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్లో పాల్గొంటాడు.
అది ఓ షెడ్యూల్ పూర్తి చేసి సుజిత్ దర్శకత్వంలో చేయాల్సిన మూవీ షూటింగ్ ను కూడా మొదలుపెడతాడు. దాని షెడ్యూల్ కంప్లీట్ చేశాక మళ్ళీ పొలిటికల్ టూర్లకు వెళ్తాడని సమాచారం. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ గురించి మాత్రం పవన్ కళ్యాణ్ అస్సలు ఆలోచించడం లేదు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని టీం భావిస్తుంది. టీజర్ కూడా అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్చింది. మరి ఈ చిత్రం పై పవన్ (Pawan Kalyan) కు ఎందుకు ఆసక్తి తగ్గిపోయింది అనే ప్రశ్నకు మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేదు. ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం.. ఈ సినిమా రషెస్ చూసిన పవన్ కళ్యాణ్ సంతృప్తిగా లేడని.. చాలా మార్పులు కోరుతున్నాడని అంతా అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?