మూడు వారాల కాల్‌షీట్లు, ఒక్కో కాల్ షీట్‌కి రూ. 2 కోట్లు.. మొత్తంగా సుమారు రూ. 45 కోట్లు. ఇదీ ఆ సినిమాకు పవన్ కల్యాణ్ తీసుకుంటున్న డబ్బులు. ఈ మాటలు మేం చెప్పడం పవన్ కల్యాణే మొన్నీమధ్య చెప్పారు. అయితే అనుకున్నట్లుగా సినిమా పూర్తవుతోందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఫుల్ స్వింగ్‌లో మొదలైన సినిమా షూటింగ్‌లో చిన్నపాటి బ్రేక్‌లు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రయాణాలు ఇంకొచెం పెద్దవి అయ్యాయి అని అంటున్నారు.
ఇదంతా ‘వినోదాయ చిత్తాం’ రీమేక్ గురించే అనే విషయం మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. పవన్ కల్యాణ్ — సాయితేజ్ కాంబినేషన్‌లో సముద్రఖని ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘వినోదాయ చిత్తాం’ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య మొదలైంది. ఒకే ప్రాంతంలో మూడు సెట్లు వేసి.. వరుసగా షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారని, ఇలాంటి షూటింగ్ టాలీవుడ్‌లో ఇలాంటి షూటింగ్ చూసి ఉండరు అంటూ ఆ మధ్య మన వెబ్ సైట్‌లో మీరు చదివి ఉంటారు కూడా.
అయితే ఇప్పుడు బ్రేక్‌లు పడ్డాయి అంటున్నారు. ఈ మేరకు కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ మూడు వారాల కాల్‌షీట్లు వచ్చారని, వరుస కాల్‌షీట్లతో సినిమాలో అతని క్యారెక్టర్ పూర్తవుతుంది అని చెప్పారు కూడా. అయితే ఇప్పుడు పవన్ బ్రేక్‌లు వేస్తున్నారట. మొన్నీమధ్య జనసేన పార్టీ ఆవిర్భావ దినోతవ్సవం కోసం రెండు రోజులు గ్యాప్ ఇచ్చారట. ఆ తర్వాత షూటింగ్ మొదలైనట్లే మొదలై ఏదో అలసటగా ఉందని కాస్త గ్యాప్ ఇచ్చారట.
ఆ తర్వాత ఈ రోజు అంటే శనివారం జరగాల్సిన షూట్‌ను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో ఏంటీ బ్రేక్‌లు సామీ అంటూ ఫ్యాన్స్ ఇబ్బందిపడుతున్నారు. నిజానికి శనివారం నుండి సోమవారం వరకు ఒకే లోకేషన్‌లో షూటింగ్ జరగాల్సి ఉందట. అయితే శనివారం జరగదు అంటున్నారు. మరి ఆది, సోమవారాల్లో ఉంటుందా లేదా అనేది చూడాలి.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్