Pawan Kalyan: వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ తాజాగా తన భార్య ఏడుస్తోందంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. వైసీపీ నేతలు అన్న మాటల వల్ల నా భార్య ఏడుస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నాకు వందల కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను సగటు మనిషినేనని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

నాకు కూడా పిల్లలు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు అన్న మాటల వల్ల నా భార్య కూడా బాధ పడుతోందని సర్ది చెప్పుకుని ముందుకు వెళుతున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నేను ఇప్పటికే బాధ్యతలను తీసుకోవడం జరిగిందని ఆ బాధ్యతల నుంచి వెనక్కు రాలేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నా భార్యకు సైతం నేను అదే విషయం చెబుతానని పవన్ చెప్పుకొచ్చారు.

నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు క్షమించాలని నేను నా భార్యకు చెబుతున్నానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. అంతకు మించి నేను ఏమీ అనలేనని పవన్ తెలిపారు. మరోవైపు పవన్ నటించిన బ్రో మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మై డియర్ మార్కండేయ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు 45 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాకు అంచనాలకు మించి ఆఫర్లు వస్తున్నాయి. పవన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus