స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. పవన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. 2019 ఎన్నికలకు కొన్నినెలల ముందు సినిమాలు ఆపేస్తానని చెప్పిన పవన్ ఎన్నికల తర్వాత వేర్వేరు కారణాల వల్ల సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుసగా సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఇకపై ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో బిజీ కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
సినిమాలకు గ్యాప్ ఇవ్వకూడదని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారని ఆ రీజన్ వల్లే పవన్ కొత్త సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సినిమాలను నిర్మించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ రాజకీయాలకు పరిమితం కానున్నారని తెలుస్తోంది. నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని పవన్ భావిస్తున్నారు.
ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయితే పవన్ నిర్మాతగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ ఉంది. 2024లో ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలలో రెండింటికీ ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు పవన్ నటించిన భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు కొన్ని నెలల గ్యాప్ లో విడుదల కానున్నాయి. భీమ్లా నాయక్ కూడా సంక్రాంతి రేసులో ఉండి ఉంటే బాగుండేదని నెటిజన్లు భావిస్తున్నారు.
రిలీజ్ డేట్ విషయంలో భీమ్లా నాయక్ కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పవన్ సినిమాలకు దూరం కారని జరుగుతున్న ప్రచారం విషయంలో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం. ఒకవైపు రీమేక్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు స్ట్రెయిట్ సినిమాలకు కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!