పవన్ ని నవల హీరోగా మారుస్తున్న త్రివిక్రమ్
- May 24, 2017 / 11:43 AM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కలయికలో మూడో సినిమా రూపుదిద్దుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఫిలిం నగర్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కథను ఓ ఫేమస్ నవల నుంచి మాటల మాంత్రికుడు తీసుకున్నారని రూమర్ జోరుగా సాగుతోంది. ఇందులో పవన్ తన తండ్రికి రెండో భార్య కొడుకుగా నటిస్తున్నట్లు కథ కూడా లీకైంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్న సంగతి ఇదివరకే బయటికి వచ్చింది.
ఆ పాత్రకు సంబంధించిన మరో విషయం లీక్ కావడంతో.. ఇది కచ్చితంగా నవల నుంచి తీసుకున్న కథే అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక త్రివిక్రమ్ గత సినిమా అ..ఆ.. యద్దనపూడి సులోచనరాణి రాసిన మీన అనే నవల ఆధారంగా తెరకెక్కింది. అయితే నేటి పరిస్థితులకు అనుగుణంగా సన్నివేశాలను మార్చారు. ఆ విషయాన్నీ సినిమా మేకింగ్, రిలీజ్ సమయంలో దాచి పెట్టి, విడుదలయిన తర్వాత సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టగా .. చివరికి ఇది మీనా నవల కథే అని త్రివిక్రమ్ ఒప్పుకున్నారు. మరి.. పవన్ 25 మూవీ కథ విషయంలో ఎప్పుడు బయటపడుతాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















