దాసరి నిర్మాణంలో “పవన్-త్రివిక్రమ్ చిత్రం !!
- April 12, 2016 / 11:03 AM ISTByFilmy Focus
“సర్దార్ గబ్బర్ సింగ్” మరి కొద్ది గంటల్లో వి \డుదల కానుంది. ఈ నేపధ్యంలో పవన్ తదుపరి చిత్రం ఏమిటనే ఆసక్తికర చర్చ అప్పుడే మొదలైపోయింది.
పవన్ కి “ఖుషి” వంటి బ్లాక్ బస్టర్, “పులి” వంటి బ్లాక్ మార్క్ పిక్చర్ ఇచ్చిన ఎస్.జె.సూర్య ముచ్చటగా మూడోసారి పవన్ తో మరో చిత్రం రూపొదించే అవకాశం సొంతం చేసుకోవడం తెలిసేందే. అయితే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారన్నదానిపై ఇంకా స్పస్హత రాలేదు.
ఇక దర్శకరత్న దాసరి నారాయణరావుకి ఓ చిత్రం చేసేందుకు పవన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం తెలిసిందే. ఈ చిత్రానికి పవన్ మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్- ఎస్.జె.సూర్య ల చిత్రం 2017లో విడుదల కానుండగా.. “దాసరి-పవన్-త్రివిక్రమ్”ల చిత్రం 2018లో ప్రేక్షకుల రానుంది.
2019లో అటు కేంద్రానికి, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. అందువల్ల ఈ చిత్రం చాలా కీలకం కానుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కేంద్ర మంత్రిగా పని చేసిన దాసరి ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలకంగా లేరు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన బి.జె.పి తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉంది. పవన్ కూడా బి.జె.పి కి సానుకూలమే కాబట్టి.. వీరిద్దరి కలయికలో వచ్చే త్రివిక్రమ్ సినిమా రాజకీయ నేపధ్యంలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది!!
















