Sir: ‘సార్‌’ కోసం పవర్‌ గెస్ట్‌ను రెడీ చేసిన త్రివిక్రమ్‌.. ఫ్రేమ్‌ అదిరిపోద్ది!

  • February 14, 2023 / 07:56 AM IST

‘‘కుటుంబ సభ్యుల సినిమాల ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు రాకపోయినా త్రివిక్రమ్‌కి సంబంధించిన సినిమాల ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు మాత్రం పవన్‌ కల్యాణ్‌ కచ్చితంగా వస్తాడు’’ — ఈ మాట మేం అనడం లేదు. మరో రెండు మూడు రోజులు పోతే సోషల్‌ మీడియా వర్గాలు, సినిమా మీడియా వర్గాల్లో ఈ చర్చే నడవబోతోంది. అంత కచ్చితంగా ఎలా చెప్పగలం అనుకుంటున్నారా? ధనుష్‌ కొత్త సినిమా ‘సార్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ కల్యాణ్‌ చీఫ్‌ గెస్ట్‌గా వస్తారని టాక్ వస్తోంది కాబట్టి.

డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. ఈ క్రమంలోనే ధనుష్ తెలుగులో రెండు స్ట్రెయిట్‌ సినిమాలు ప్లాన్ చేశాడు. అందులో ఒకటి వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందింది. అదే ‘సార్’. తమిళంలో ‘వాతి’ అనే పేరుతో తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. సినిమాకు ట్రైలర్‌తో కాస్త హైప్‌ వచ్చినా.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా చేసి ఇంకా బజ్‌ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు త్రివిక్రమ్‌.

సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమా కంబైన్డ్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. తొలి రెండు సంస్థలు త్రివిక్రమ్‌కు బాగా దగ్గరైనవే. సితారకు నాగవంశీ నిర్మాత. ఇక ఫార్చ్యూన్‌ ఫోర్‌ అనేది త్రివిక్రమ్‌ భార్య సౌజన్యది. దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ను తీసుకొస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ వస్తే మాత్రం.. ఈవెంట్‌ అదిరిపోద్ది అని చెప్పొచ్చు. పవన్‌, త్రివిక్రమ్‌, ధనుష్‌.. ఈ ఫ్రేమ్‌ ఎలా ఉంటుందో ఊహించుకోండి.

విద్యా వ్యవస్థ నేపథ్యంలో ‘సార్‌’ సినిమాను తెరకెక్కించారు. టీచర్‌గా ఓ పాఠశాలలోకి వచ్చిన ధనుష్‌.. అక్కడి పరిస్థితులు, విద్యా వ్యవస్థ నడుస్తున్న విధానం చూసి ఏం చేశారు అనేదే కథ.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus