జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఆయన తీసే సినిమాలలో కూడా అనేక రాజకీయపరమైన సీన్లు, పవర్ఫుల్ పంచ్ లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన బ్రో సినిమాలో కూడా వర్తమాన రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా సన్నివేశాలు, డైలాగులు పెట్టి ఏపీ మంత్రిని టార్గెట్ చేశారని కామెంట్స్ వచ్చాయి. బ్రో సినిమాలో పృథ్వి చేసిన శ్యాంబాబు పాత్రతో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పరోక్షంగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్.
మొదట అది మామూలు పాత్ర గానే కనిపించినప్పటికీ మై డియర్ మార్కండేయ పాట చూస్తే అది ఏపీ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన క్యారెక్టర్ గా కనిపిస్తుంది. దీంతో ఈ పాటలో శ్యాం బాబు పాత్ర పై సెటైర్లు పేలుతున్నాయి. ఇలాంటి తరుణంలో బ్రో కలెక్షన్స్ పై అంబటి మరోసారి తన శైలిలో కామెంట్ చేశారు. నన్ను కించపరిచేలా పవన్ సినిమాలు తీస్తున్నారు. పవన్ నటించిన బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ కలెక్షన్ కూడా పెద్దగా లేదు.
శ్యాంబాబు, రాంబాబు అని మాట్లాడితే ఆ పూర్తి కలెక్షన్స్ వచ్చాయి. పవన్, త్రివిక్రమ్ కూర్చొని నాపై స్క్రిప్ట్ రాశారు. వారాహి వాహనాన్ని తన కాళ్ల కింద పెట్టుకొని అమ్మవారిని అవమానించారు చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీని ఎన్ఆర్ఐ విశ్వప్రసాద్ ద్వారా అందజేస్తున్నారని కామెంట్స్ చేశారు. పవన్ తన సినిమాలకు బ్లాక్ మనీ వాడుతున్నారని పవన్ తీరు లోపల ఒకలా బయట మరోలా ఉంటారని ఘాట్ గా స్పందించారు . పవన్ వ్యక్తిగత తీరుపై కథ రెడీ అవుతోంది ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చాయి నిత్య పెళ్లికొడుకు అని ఒకాయన పేరు సూచించారు.
మూడు ముళ్లు ఆరు..ఆరు పెళ్లీలు, బహుభార్య కోవిదుడు, మ్రో, అయిన పెళ్లీలు ఎన్నో.. పోయిన చెప్పులు ఎన్నో అనే పేర్లు పరిశీలిస్తున్నామని కామెంట్స్ చేశారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్, డిజాస్టర్. నిన్నటి వరకు రూ.55.26 కోట్ల షేర్ వచ్చింది. నిన్న రూ.2.30 కోట్లే వచ్చాయి. మొత్తంగా సినిమాకు రూ.70 కోట్లు వస్తే గొప్ప. బ్రో సినిమా తీసిన ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు. ఎవరిపైనో పైశాచిక ఆనందంతో సినిమా తీస్తే.. ప్రజలకు చేరదు’ పవన్ కల్యాణ్‍కు క్లైమాక్స్ చూపిస్తామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.