పవర్ స్టార్ పవన్ కల్యాణ్….జనసేన పేరుతో గర్జన మొదలు పెట్టాడు. మొన్న జరిగిన సభలో అందరినీ ఒక రౌండ్ వేసుకున్న పవన్ ఇక వెనకడుగు వెయ్యను అంటున్నాడు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను అని, చెప్పింది చెప్పినట్లు చేస్తాను అని అంటున్నాడు…అదే క్రమంలో మొన్న తిరుపతిలో జరిగిన సభలో తాను చెప్పినట్లు కాకినాడలో సభ ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నాడు పవన్, వచ్చే శుక్రవారం అంటే రానున్న 9న కాకినాడలో పవన్ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సభకు “సీమాంధ్ర ఆత్మగౌరవ సభ” అని నామకరణం సైతం చేశారు. ఇక ఏ సభను కాకినాడలోని జేఎన్.టీయు మైదానంలో నిర్వహించాలని ఇప్పటికే అక్కడ సభ ఏర్పాటు చేసుకోవడానికి యూనివెర్సిటీ పర్మిషన్ కూడా తీసుకున్నట్లు సమాచారం.ఇక అదే క్రమంలో ఈ సభ కోసం పలు ప్రాంగణాలు చూసినప్పటికీ ఈ స్థలం అయితే బావుంటుంది అని పవన్ చెప్పినట్లు తెలుస్తుంది.
ఇక మరో పక్క ఇప్పటికీ పవన్ తాను చెప్పిన మూడు సూత్రాల్లో మొదటిది సభల ద్వారా తమ గొంతును ప్రజలకు వినిపించాలి అన్న దాన్ని మొదలు పెడుతున్నాడు అని….దీనికి ఫలితం రాకపోతే మరో రెండు సూత్రాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పవన్ రాష్ట్రం కోసం పోరాడుతున్న తీసు చూస్తుంటే అభిమానులే కాదు, యావత్ రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తుంది అని చెప్పక తప్పదు. మరి ఈ ఆత్మ గౌరవ నినాదం పుణ్యమా అని మనకు ప్రత్యేక హోదా వస్తే…యావత్ ఆంధ్ర ప్రదేశ్ పవన్ కు రుణపడి ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.