పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్లో ‘ఖుషి’ (Kushi) ఓ స్పెషల్ మూవీ. ‘బద్రి’ తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే లవ్ స్టోరీ చేస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు. అయితే అదే ప్రయోగం చేశాడు పవన్ కళ్యాణ్. ఎస్.జె.సూర్య (SJ Surya) ఆల్రెడీ తమిళంలో తీసిన ‘ఖుషి’ ని పవన్ కళ్యాణ్ తో అదే టైటిల్ తో రీమేక్ చేశారు. ఇందులో కథ ఏమీ ఉండదు. చిన్నప్పుడు యాక్సిడెంటల్ గా ఎదురైన చిన్నపిల్లలు … పెద్దవాళ్ళయ్యాక చదువుకునే రోజుల్లో కలిస్తే.. వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి.. ప్రేమికులు అయ్యే టైంలో ఇగో క్లాష్ వచ్చి విడిపోతే.. తర్వాత ఎలా విడిపోయి కలిశారు అనేది లైన్.
ఈ కథని వేరే హీరో అయితే ‘ఏముంది ఇందులో?’ అని రిజెక్ట్ చేసేవాడేమో. కానీ పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఓకే చేశాడో అని అంతా టైంలో ఆశ్చర్యపోయారు. కానీ ‘ఖుషి’ సూపర్ హిట్ అయ్యి అందరికీ మరింత షాక్ ఇచ్చింది. 2001 వ సంవత్సరంలో ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 24 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.40 cr |
సీడెడ్ | 3.35 cr |
ఉత్తరాంధ్ర | 1.60 cr |
ఈస్ట్ | 1.18 cr |
వెస్ట్ | 1.50 cr |
గుంటూరు | 0.19 cr |
కృష్ణా | 1.70 cr |
నెల్లూరు | 0.97 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 0.19 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
1.00 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 20.02 cr |
‘ఖుషి’ చిత్రం రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.20.2 కోట్ల షేర్ ను రాబట్టి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. బయ్యర్లకు దాదాపు రూ.7 కోట్ల వరకు లాభాలు పంచింది ఈ సినిమా.