నటి సూసైడ్ నోట్.. లైంగిక వేధింపులే కారణమా!

మంచు మనోజ్ -చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రయాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది పాయల్ ఘోష్. ‘ప్రయాణం’ పెద్ద సక్సెస్ కాలేదు కానీ మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. నటిగా పాయల్ ఘోష్ కు మంచి మార్కులు పడ్డాయి. కానీ తెలుగులో ఆమెకు ఎక్కువ అవకాశాలు అయితే రాలేదు. అడపా దడపా హిందీ సినిమాల్లో నటించింది. కొంత గ్యాప్ తర్వాత ఎన్టీఆర్- సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ లో ఫ్రెండ్ రోల్ చేసింది.

ఆ తర్వాత ‘మిస్టర్ రాస్కెల్’ అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు చాలా మందికి తెలీదు. అంతే… తెలుగులో ఈమె సినీ ప్రయాణం గురించి గురించి చెప్పుకోవడానికి ఇంకేమి లేదు. కానీ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈమె పై లైంగిక దాడి చేశాడంటూ మొన్నామధ్య సోషల్ మీడియా వేదికగా తెలియజేసి కొన్నాళ్ళ పాటు వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా ఈమె ఓ సూసైడ్ నోట్ రాసి పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

‘నేను పాయల్ ఘోష్.. ఒకవేళ నేను సూసైడ్ చేసుకున్నా… హార్ట్ ఎటాక్ తో పోయినా దానికి కారణం…’ అంటూ ఖాళీ ఉంచి పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్ కంగారు పడుతూ కామెంట్లు పెడుతున్నారు. ‘మీకు ఏమైంది మేడం.. కంగారు పడకండి.. ఏదైనా బ్రతికుండి సాధించండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పాయల్ ఘోష్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus