Payal Rajput: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నటి పాయాల్!

RX100 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ మొదటి సినిమాతోనే మెప్పించింది. బోల్డ్ సీన్స్, లిప్ కిస్ సీన్స్ తో మొదటి సినిమాతోనే పెద్ద ఎత్తున సందడి చేసిన ఈమెకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే తదుపరి నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆదరణ పొందలేదు. ఇలా పాయల్ పలు సినిమాలలో నటించిన ఈమెకు గుర్తింపు రాకపోవడంతో తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతితో కలిసి మంగళవారం అని సినిమాకి కమిట్ అయ్యారు.

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ (Payal Rajput) నటించిన మంగళవారం సినిమా ట్రైలర్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి పాయల్ ఆరోగ్య సమస్యల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అజయ్ ఈ కథతో నన్ను అప్రోచ్ అయ్యేసరికి నా పరిస్థితి బాగోలేదు. ఇది ఎవ్వరికి తెలీదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను.

ఈ సమస్యకు మందులు వాడుతున్నా సర్జరీ చేయాల్సిందే అని డాక్టర్ చెప్పారు. ఇక అజయ్ గారు ఈ కథ చెప్పిన తర్వాత ఈ సినిమా కథ నాకు నచ్చడంతో ముందు సినిమా పూర్తి చేసే తర్వాత సర్జరీకి వెళ్దామని నిర్ణయించుకొని ఈ సినిమాకు కమిట్ అయ్యానని ఈ సందర్భంగా పాయల్ తెలియజేశారు. ఇలా ఆరోగ్య సమస్య గురించి ఈమె తెలియజేశారు కానీ మరి సర్జరీ పూర్తి అయిందా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఈ విధంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతూ సినిమా కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పాయల్ ఈ సినిమాలో నటించారు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే సినిమాల కన్నా ఆరోగ్యం కూడా ముఖ్యం కదా అంటూ ఈమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తన పరిస్థితి అలా పెట్టుకొని సినిమాలలో నటించారు అంటే సినిమా పట్ల ఈమెకు ఉన్నటువంటి అంకిత భావం కూడా తెలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus