Payal Rajput: వైరల్ అవుతున్న పాయల్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

స్టార్ హీరో ప్రభాస్ ను (Prabhas)  సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం ఎంతో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి పేరు సంపాదించుకున్నారు. కొన్ని సినిమాలలో పాయల్ రాజ్ పుత్ ఒకింత బోల్డ్ రోల్స్ లో కూడా నటించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాయల్ తను చేసిన కామెంట్ల ద్వారా ప్రభాస్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

స్టార్ హీరో ప్రభాస్ అంటే నాకు చాలా అభిమానం అని ఆమె పేర్కొన్నారు. ప్రభాస్ ను మీట్ అయితే ప్రభాస్ కొరకు స్వయంగా వంట చేసి పెడతానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ కోసం లంచ్ ఏర్పాటు చేస్తానని రాజ్మా రైస్ నాకు ఇష్టమైన ఆహారం అని పాయల్ రాజ్ పుత్ వెల్లడించారు. నాకు ఇష్టమైన ఆహారం రాజ్మా రైస్ అని రాజ్మా రైస్ నా చేతులతో ఉండి నా చేతులతో ప్రభాస్ కు తినిపిస్తానని పాయల్ పేర్కొన్నారు.

పాయల్ రాజ్ పుత్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పాయల్ కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ తలచుకుంటే పాయల్ కు అవకాశం ఇవ్వడం కష్టం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కల్కి (Kalki 2898 AD) సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెరగాల్సిన అవసరం అయితే ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ ను ఈ సినిమా ఎన్నో రెట్లు పెంచుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus