Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పెదవి దాటని మాటొకటుంది

పెదవి దాటని మాటొకటుంది

  • July 27, 2018 / 05:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెదవి దాటని మాటొకటుంది

కొత్త నటీనటులు, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత.. ఇలా అందరూ కొత్తవాళ్లతో రూపొందిన కాన్సెప్ట్ ఫిలిమ్ “పెదవి దాటని మాటొకటుంది”. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకొన్న ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. మరి ఈ కొత్తవాళ్ళ ప్రయత్నం ఏమేరకు ఫలించ్చిందో చూద్దాం..!! pedavi-datani-matokatundi-movie-review1

కథ : తరుణ్ (రావన్ రెడ్డి)కి స్కూల్ & కాలేజ్ డేస్ లో అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అప్పట్లో మనోడు ఆల్మోస్ట్ మన్మధుడు అన్నమాట.. అమ్మాయిలందరూ నన్ను ప్రేమించు అంటే కాదు నన్ను అంటూ క్యూ కట్టేవారు. మనోడేమో మగజాతి ఆణిముత్యంలా ఆ ప్రపోజల్స్ అన్నీ రిజెక్ట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేసేవాడు. తీరా ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి సీన్ రివర్స్ అయ్యింది. సరైన చదువు లేకపోవడంతో తరుణ్ కి మంచి ఉద్యోగం దొరకదు, ఆఖరికి ఏ అవకాశం లేకపోవడంతో ఒక కంపెనీలో జానేటర్ (సాఫ్ట్ వేర్ కంపెనీలు, మల్టీప్లెక్స్ లలో బాత్ రూమ్ లు కడగడం, ఫ్లోర్ లు క్లీన్ చేసే స్పెషలిస్ట్)గా వర్క్ చేస్తుంటాడు.

తాను కాలేజ్ డేస్ లో మంచి ఫామ్ లో ఉండగా రిజెక్ట్ చేసిన అమ్మాయిల్లో ఒకరైన ఆహానా (పాయల్ వాద్వా) చిన్నప్పుడు జిడ్డు మొహంతో చిరాకెత్తేలా కనిపించినా.. పెద్దయ్యాక పాండ్స్ బ్యూటీలా తయారవుతుంది. సొ, మనోడు ఆమెను సైలెంట్ గా ఫాలో అవుతూ ఇంకా సైలెంట్ గా ప్రేమిస్తుంటాడు తప్ప తన ప్రేమను మాత్రం వ్యక్తపరచడు. తరుణ్ తన ప్రేమను ఆహానాతో చెప్పాలంటే చిన్న టెస్ట్ పాసవ్వాల్సి వస్తుంది. ఏమిటా టెస్ట్? ఆ టెస్ట్ లో తరుణ్ పాసయ్యాడా లేదా? అనేది “పెదవి దాటని మాటొకటుంది” సినిమా చూస్తే అర్ధమవుతుంది. pedavi-datani-matokatundi-movie-review2

నటీనటుల పనితీరు : కథానాయకుడిగా తరుణ్, స్నేహితుడి పాత్రలో మొయీన్, తండ్రి పాత్రలో నరేష్, కథానాయిక పాత్రలో పాయల్ ఇలా అందరూ పాత్రకు అవసరమైన మేరకు మాత్రమే తమ నట ప్రతిభ కనబరిచి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు అందుకొంటే.. బంటీ అనే పాత్రలో నటించిన నందు కుమార్ మాత్రం నటించడం మానేసి “అతి” చేస్తూ.. ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారీ కథాగమనానికి అడ్డంకిగా మారడంతోపాటు.. ప్రేక్షకుల సహనాన్ని పారీక్షించాడు. ఫంకీగా ఉంటుందని దర్శకుడు భావించాడో లేక మిస్టర్ నందు కుమారే అలా నటించాడో తెలియదు కానీ.. కాస్తో కూస్తో బాగున్న సినిమాకి పెద్ద మైనస్ లా తయారయ్యాడు. pedavi-datani-matokatundi-movie-review3

సాంకేతికవర్గం పనితీరు : జీనిత్ రెడ్డి సంగీతం, నమన్-యతిన్ ద్వయం సినిమాటోగ్రఫీ సినిమాలోని కంటెంట్ కి తగ్గట్లుగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. దర్శకుడు గురుప్రసాద్ కథ పరంగా పెద్దగా హోమ్ వర్క్ ఏమీ చేయలేదు, అలాగే కథనం విషయంలోనూ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. “క్యూపిడ్” అనే కాన్సెప్ట్ ను ఆడియన్స్ ను ఇంకాస్త క్లారిటీగా ఎక్స్ ప్లేన్ చేసి, హీరో & టీం ఆ క్యూపిడ్స్ గా ఎందుకు మారారు అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే సగంలో సగం మందైనా సినిమాకి కనెక్ట్ అయ్యేవారేమో.

ఈ క్యూపిడ్ ఏంటా అని బుర్ర గోక్కుంటున్నారా?.. గ్రీకు దేశంలో మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోయి, దాని బదులు కోపం, ఈర్ష్య వంటివి పెంచుకొంటున్న తరుణంలో ప్రేమ దేవత, యుద్ధ దేవుడు కలిసి పుట్టిన కుర్రాడే “క్యూపిడ్”. ఎక్కడ, ఎవరిలో అయితే ప్రేమ లోపిస్తుందో.. వారి మనసుకి ప్రేమ బాణం వేసి వారిలో ప్రేమ చిగురింపజేయడం ఆ క్యూపిడ్ పని. ఈ క్యూపిడ్ అనే జనాలకి పెద్దగా ఐడియా లేని కాన్సెప్ట్ ను కొత్త కాన్సెప్ట్ అనుకోని.. శేఖర్ కమ్ముల తరహాలో వైవిధ్యమైన గొంతులతో, సహజంగా సినిమా తీద్దామని గురుప్రసాద్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. pedavi-datani-matokatundi-movie-review4

విశ్లేషణ : న్యూ ఏజ్ సినిమా అనేసరికి కొత్తగా తీద్దామనే ప్రయత్నంలో ఫిలిమ్ మేకర్స్ షార్ట్ ఫిలిమ్ కి ఎక్కువ వెబ్ సిరీస్ కి తక్కువ లాంటి సినిమాలు తీసేసి జనాల మీదకి వదిలేస్తున్నారు. సినిమా తీయాలనే ప్యాషన్, ఫిలిమ్ మేకింగ్ పట్ల నాలెడ్జ్ తోపాటు.. కథ-కథనాలపై కాస్త పట్టు, సెన్సిబిలిటీస్ కూడా దర్శకుడికి కావాల్సిన లక్షణాలని ఈ కొత్త దర్శకులు ఎప్పుడు అర్ధం చేసుకొంటారో ఏమో. pedavi-datani-matokatundi-movie-review5

రేటింగ్ : 1/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movie Review
  • #Movie Reviews
  • #Pedavi Daatani Matokatundi Movie Review
  • #Pedavi Daatani Matokatundi Movie Telugu Review
  • #Pedavi Daatani Matokatundi Review

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

9 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

11 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

11 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

12 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

13 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

7 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

8 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

9 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

10 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version