“కొమ్మల్లో సక్కటి.. కోయిలే ఒక్కటీ.. గుండెనే గొంతు సేసి పాడతాంది.. రార పెనిమిటీ…”.. ఈ పదాలు రామజోగయ్యే శాస్త్రి కలం నుంచి వచ్చాయి. ఇవే కాదు అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని “పెనిమిటి” పాటలోని సాహిత్యం.. హృదయం ఒంటరిగా కూర్చిని బాధపడినట్లు ఉంది. వింటున్న వారి హృదయాల్లోని ఆరిపోతున్న చెమ్మని తట్టి లేపుతున్నట్టు ఉంది ఈ పాట. పెనివిటి రాక కోసం ఎదురు చూస్తున్న ఇల్లాలి గాధను తెలుపుతున్న ఈ పాటను సాధారణంగా గాయనితో పాడించాలి.. కానీ గాయకుడు కాల భైరవ అద్భుతంగా పాడారు. విన్న ప్రతి ఒక్కరూ ప్రసంశలు గుప్పిస్తున్నారు.
“పొలిమేర దాటిపోయావని.. పొలమారి పోయే నీ దానిని” వంటి ప్రయోగాలు అభినందనలు అందుకుంటున్నాయి. “యేటకత్తి తలగడై ఏడ పండుకుంటివో” అనే పదాలతో రాయలసీమలోని కొంతమంది ఇల్లాలి ఆవేదనని కళ్లకి కట్టారు. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం మనసులని మెలిపెడుతోంది. మొత్తానికి ఈ పాట సినిమా రిలీజ్ కి ముందే రికార్డులను సృష్టిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.