Bro Movie: ‘బ్రో’ పైనే ఆశలు పెట్టుకున్న ‘పీపుల్ మీడియా’

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్.. ఈ మధ్య కాలంలో మంచి ఊపు మీద ఉన్న బ్యానర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.ఈ బ్యానర్ నుండి చాలా హిట్ సినిమాలు వచ్చాయి. ‘గూఢచారి’ ‘ఓ బేబీ’ ‘వెంకీ మామ’ ‘రాజ రాజ చోర’ ‘కార్తికేయ 2’ ‘ధమాకా’ ఇలా చాలా హిట్ సినిమాలు వచ్చాయి. ఏ సినిమాకి కూడా ప్రమోషన్ విషయంలో విశ్వ, వివేక్ కూచిభొట్ల.. తక్కువ చేయరు. అయితే ఈ బ్యానర్ నుండి వచ్చిన గత 3,4 సినిమాలు పెద్ద ఫ్లాప్స్ గా మిగిలాయి.

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ‘రామబాణం’ వంటి సినిమాలు డిజాస్టర్లు కాగా.. తమ బ్యానర్ ద్వారా రిలీజ్ చేసిన ‘టక్కర్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ‘ఆదిపురుష్’ కూడా వారికి 30 శాతం పైనే నష్టాలను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ పైనే వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరో ఈ ప్రాజెక్టులో భాగమైనా, త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించినా ఎందుకో.. బజ్ పెద్దగా ఏర్పడలేదు.

గత సినిమాల నష్టాలను తీర్చే భారం కూడా (Bro Movie) ‘బ్రో’ పై పడింది. మరోపక్క ఏపీ ప్రభుత్వం ‘బ్రో’ సినిమా బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలు, మల్టీప్లెక్సుల్లో ఎక్స్ట్రా షోలు పడకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఓవర్సీస్ లో బుకింగ్స్ యావరేజ్ ఉన్నాయి. మరోపక్క నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలు. వీటిన్నంటినీ అధిగమించి బ్రో ఎంత వరకు సక్సెస్ సాధిస్తుందో .. ‘పీపుల్ మీడియా’ వారికి రిలీఫ్ ఇస్తుందో లేదో చూడాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus