ఇప్పటికే 25 పూర్తి… మరో 18 నెలలు 25 సినిమాలు.. హౌ.. ఎలా.. కైసే?

టాలీవుడ్‌లో రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా ‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ’ అనే చెప్పాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణ సంస్థ నుండి 25 సినిమాలు అయిపోయాయి. త్వరలో అంటే మరో నెలన్నరలో 25వ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక్కడ వరకు ఓకే.. ఇప్పుడు ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ హెడ్‌ టి.జి.విశ్వప్రసాద్‌ చెబుతున్న ప్రకారం అయితే.. త్వరలో 50 సినిమాలు చేసేస్తాం అని అంటున్నారు.

దీంతో అసలు పీపుల్‌ మీడియా ప్లాన్‌ ఏంటి? అంటూ చర్చ మొదలైంది. దీనికి కారణం ఇటీవల ఆయన ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పిన విషయాలే. ‘‘పవన్‌ కల్యాన్‌ – సాయిధరమ్‌తేజ్‌ల ‘బ్రో’ సినిమా మా బ్యానర్‌ నుండి రానున్న 25వ చిత్రం. మా తొలి 25 సినిమాల్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాం. కానీ నెక్స్ట్‌ 25 సినిమాల్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తాం. అలా వీలైనంత త్వరగా 50 సినిమాల మైల్‌స్టోన్‌ను చేరుకుంటాం’’ అని చెప్పారు.

దీంతో 18 నెలల్లో 25 సినిమాలు చేయాలంటే అంత ఈజీనా.. అసలు అవకాశం ఉందా? అని అడుగుతున్నారు. అయితే ఇక్కడో విషయాన్ని మరచిపోకూడదు అనే మాట కూడా వినిపిస్తోంది. అదే ఈ నిర్మాణ సంస్థ టీమ్‌. వాళ్ల దగ్గర కథ ఎక్కువ రోజులు వెయిటింగ్‌లో ఉండదట. కథ విన్నాం, ఓకే అనుకున్నాం.. సెట్స్‌ మీదకు పంపించాం అనే కాన్సెప్ట్‌లో ఉంటారట. ఒకవేళ నో అనుకుంటే వాయిదాలేమీ ఉండవట.. ఠక్కున అదే విషయం చెప్పేస్తారట.

అలాగే సినిమా టీమ్ సినిమా ప్రారంభం అయింది అనే విషయం కూడా అధికారికంగా ఈవెంట్‌లు, కార్యక్రమాలు చేసి చెప్పదు. ఆ నోటా ఈ నోటా బయటకు రావడం తప్ప ఇంకేమీ ఉండదు. ఇక పెట్టుబడుల విషయంలోనూ బలంగానే ఉన్నారట. ఇవన్నీ కలిపి నెలకు రెండు సినిమాలు లెక్కన మొదలెట్టేసే అవకాశం ఉంది అంటున్నారు. చూడాలి మరేం చేస్తారో?

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus