సోషల్ మీడియా అభిమానులకు.. సెలబ్రిటీలకు మధ్య వారధిగా ఉంటుంది. ఈ వేదికను సక్రమంగా ఉపయోగించుకోవాలి కానీ.. బెదిరించడం.. ఇష్టప్రకారం మాట్లాడకూడదు. అలా చేస్తే మాత్రం ఊసలు లెక్కించాల్సిందే. ఇదివరకు కొంతమంది నోరు జారీ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ ని బెదిరించినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ అయ్యాడు. అసలు విషయంలోకి వెళితే… రీసెంట్ గా కేరళ చలనచిత్రోత్సవంలో మలయాళ నటి పార్వతి సినిమాల్లో మహిళా పాత్రల గురించి మాట్లాడారు. ఒక సంవత్సరం క్రితం వచ్చిన ‘కసాబా’ సినిమాలో మమ్ముట్టి ఆడాళ్ళను అసభ్యకరంగా తిట్టడం బాగా లేదంటూ ఆమె మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకుంది. దాంతో ఆగ్రహించిన మమ్ముట్టి ఫ్యాన్స్ వెంటనే ఆమెపై ఆన్ లైన్లో బూతుల వర్షం కురిపించారు.
ఒక అడుగు ముందుకు వేసిన 23 ఏళ్ల పింటోని కనిపిస్తే అత్యాచారం చేస్తామంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో పార్వతి చాలా బాధపడ్డారు. ఒక నటికి ఇచ్చే గౌరవం ఇదేనా? మహిళలు తమ అభిప్రాయాన్ని కూడా చెప్పుకోకూడదా? అని కేరళ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన కేరళ సైబర్ క్రైం పోలీసులు విచారణ జరిపి… మమ్ముట్టీ ఫ్యాన్స్ అసోసియేషన్ కు చెందిన పింటోని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ పోస్ట్ ని షేర్ చేసిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు.