బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి దశకి చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. డిసెంబర్ 17వ తేదిన డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్, సెలబ్రిటీల రాకతో స్టేజ్ దద్దరిల్లబోతోంది. ఈసీజన్ కి విన్నర్ ఎవరు అవుతారు అనే ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో లెక్కలు చూస్తుంటే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ ఎగరేసుకుని పోయేలా కనిపిస్తున్నాడు. అయితే, అఫీషియల్ పోలింగ్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పటివరకూ తెలీదు. ఒకవేళ అమర్ కి ఎక్కువగా ఉంటే, అమర్ గెలిచే అవకాశం కూడా ఉంది. శివాజీ కూడా క్రేజ్ మాములుగా లేదు.
శివాజీ కూడా ట్రోఫీ గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఇప్పటివరకూ గేమ్ ఎలా ఆడాడు ? ప్లస్ పాయింట్స్ ఏంటి ? మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే., రైతుబిడ్డ అంటూ బిగ్ బాస్ పై అమితమైన ప్రేమతో 13వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు. రాగానే లేడీ లక్ బ్యాండ్ ని రతికకి కట్టి కనెక్ట్ అయ్యాడు. రతిక కూడా ఫస్ట్ లో ఫన్ చేద్దామని అనుకుంది. ఇద్దరూ కంటెంట్ క్రియేట్ కోసమే లవ్ ట్రాక్ నడిపారు.
ఫస్ట్ వీక్ లోనే ఇదే విషయంలో పల్లవి ప్రశాంత్ నామినేట్ అయ్యాడు. ప్రియాంక మీరిద్దరూ రైతుబిడ్డలని కనెక్ట్ అయ్యారా..? అసలు అందరితో జల్ అవ్వడం లేదని నామినేట్ చేసింది. అలాగే, కిరణ్ రాథోడ్, షకీలా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని, అన్ వర్తీ అని నామినేట్ చేశారు. మొదటి వారంలోనే పల్లవి ప్రశాంత్ కి అన్ అఫీషియల్ సైట్స్ లో ఓటింగ్ దద్దరిల్లిపోయింది. ఒక విన్నర్ కి పడాల్సిన ఓటింగ్ అనేది వచ్చింది. ఇదే ప్లస్ పాయింట్ అయ్యింది. ఆ తర్వాత రెండో వారంలో అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, థామిని, గౌతమ్ ఇలా అందరూ కూడా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి నామినేట్ చేస్తూ హీరోని చేశారు.
పిట్ నామినేషన్ లో షవర్ కింద తడుస్తూ పుష్ప మేనరిజమ్స్ చేస్తూ రెచ్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఇక్కడే హౌస్ మేట్స్ అందరూ కూడా అరేయ్, ఓరేయ్ అని పల్లవి ప్రశాంత్ ని పిలవడం అనేది ఎవ్వరికీ నచ్చలేదు. ముఖ్యంగా ఆడియన్స్ అందరికీ పల్లవి ప్రశాంత్ ని చిన్నచూపు చూస్తున్నారని అనిపించింది. అప్పుడే శివాజీకి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇద్దరూ గురుశిష్యుల్లాగా హౌస్ లో సెటిల్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ కి గైడెన్స్ ఇస్తూ సీరియల్ బ్యాచ్ నుంచీ ప్రొటక్ట్ చేస్తూ శివాజీ చక్రం తిప్పాడు.
ఇది పల్లవి ప్రశాంత్ కి బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక వీరిద్దరితో పాటుగా యావర్ వచ్చి చేరడంతో స్పై బ్యాచ్ క్రియేట్ అయ్యింది. శివాజీ బ్యాచ్ స్పై బ్యాచ్ అయితే, సీరియల్ బ్యాచ్ స్పా బ్యాచ్ అయ్యింది. దీంతో స్పై బ్యాచ్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదట్లో ప్రియాంక ఈగోకి కూడా బాగా బలైపోయాడు ప్రశాంత్. ఆ తర్వాత పవర్ అస్త్రాని గెలుచుకునే టాస్క్ లో కంటెండర్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాడు. ఎప్పుడైతే పవర్ అస్త్రాని పట్టుకుని యావర్ – శుభశ్రీ – పల్లవి ప్రశాంత్ కలిసి టాస్క్ ఆడారో అప్పుడు పల్లవి ప్రశాంత్ కి పూర్తిగా హైప్ వచ్చేసింది.
రతిక చేసిన నిందలు, అమర్ చేసిన ఓవర్ యాక్షన్ , రతిక అన్నమాటలు ఆడియన్స్ కి బాగా తగిలాయ్. నోట్లో కిరోసిన్ పోస్తా, గెడ్డం సగం గీస్తా, మీ అమ్మా నాన్న ఎలా పెంచారు అసలు ఇలాంటి డైలాగ్స్ అన్నీ పర్సనల్ గా రతిక ఎటాక్ చేసినట్లుగా అయ్యింది. దీంతో పల్లవి ప్రశాంత్ పై సింపతీ కలిగింది. నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి కూడా ఓటింగ్ గ్రాఫ్ పెరిగిపోయింది. అప్పుడు మౌనంగా విని భరించిన పల్లవి ప్రశాంత్ రతిక రీ ఎంట్రీ తర్వాత గట్టిగా గడ్డి పెట్టాడు. దీంతో పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
ముఖ్యంగా అమర్ దీప్ – సందీప్ చిన్నచూపు చూస్తున్నారనే భావన కలిగింది. అలాగే, ప్రియాంక – శోబాశెట్టి , రతిక కూడా తీసిపారేసినట్లుగా చాలాసార్లు మాట్లాడారు. దీనివల్ల పల్లవి ప్రశాంత్ కి ఇంకా హైప్ పెరిగిపోయింది. మరోవైపు అమర్ – సందీప్ పౌల్ గేమ్స్ ఆడటం, పల్లవి ప్రశాంత్ ఇచ్చిన టాస్క్ ల్లో దుమ్మురేపడం అనేది మరింత ప్లస్ పాయింట్ అయ్యింది. కోర్ట్ నామినేష్స్ తర్వాత రతిక పల్లవి ప్రశాంత్ ని డైరెక్ట్ గా తిట్టేసింది. దీంతో అక్కా అంటూ అక్కడితో కట్ చేశాడు ప్రశాంత్.
అంతేకాదు, రీ ఎంట్రీ ఇచ్చాక కూడా అక్కా అనొద్దంటూ మళ్లీ ప్రశాంత్ తో ఉండేందుకు ట్రై చేసింది కానీ వర్కౌట్ అవ్వలేదు. హౌస్ లో వివాదాలకి పల్లవి ప్రశాంత్ చాలా దూరంగా ఉన్నాడు. ఫస్ట్ నుంచీ కూడా ఎవరితో ఆర్గ్యూమెంట్ అనేది పెట్టుకోలేదు. కిచెన్ లో ఫుడ్ దగ్గర కూడా లొల్లి అనేది లేకుండా చూస్కున్నాడు. తన పని తాను చేస్కుంటూ టాస్క్ లు వచ్చినప్పుడు దుమ్మురేపాడు. ఎప్పుడైతే కలర్ పజిల్ గేమ్ సెకన్స్ లో ఫినిష్ చేశాడో బయట ఎంతోమంది ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు.
ఫస్ట్ లో శివాజీ ఎందుకు ఎంకరేజ్ చేశాడా అనేది ఆడియన్స్ కి సైతం క్లారిటీ వచ్చింది. మొదట్లో శివాజీ వాడు వేరు .. వాడిలో ఫైర్ ఉంది అని పొగడటాన్ని సీరియల్ బ్యాచ్ తట్టుకోలేకపోయారు. దీంతో టాస్క్ లో ఎలాగైనా సరే గెలవాలని పంతం పట్టుకున్నారు. కానీ చివరకి బిస్కెట్ అయ్యారు. బడ్డీ టాస్క్ అనేది అమర్ – సందీప్ కి పెద్ద మైనస్ అయిపోయింది. ఆ తర్వాత కూడా వాళ్లు పౌల్ గేమ్స్ ఆడటం అనేది పల్లవికి ప్లస్ అయిపోయింది.
ఇలా శివాజీ అండతో ఎలా మాట్లాడాలి అనేది సలహాలు తీస్కుంటూ, గేమ్ లో తనదైన స్టైల్లో స్పీడ్ గా ఆడుతూ టాస్క్ లు వచ్చినపుడు 200 శాతం ఎఫర్ట్ పెట్టాడు. ఇదే పల్లవి ప్రశాంత్ బలం. మొక్క విషయంలో ఫస్ట్ లో బొక్కై పోయినా ఆ తర్వాత ఇచ్చిన మొక్కని కాపాడుకంటూ వచ్చాడు. పల్లవి ప్రశాంత్ రతిక వెళ్లిపోయిన తర్వాత హౌస్ లో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. మళ్లీ రతిక వచ్చినపుడు ఎలా డీల్ చేయాలో అర్దం కాలేదు. ఇక్కడ శివాజీ హెల్ప్ బాగా ఉంది. తర్వాత రతిక మళ్లీ ఎలిమినేట్ అయిన దగ్గర్నుంచీ పాత పల్లవి ప్రశాంత్ కనిపిస్తున్నాడు.
మైనస్ పాయింట్స్ చూసినట్లయితే, నామినేషన్స్ అప్పుడు తను బిహేవ్ చేసే పద్దతి కొంతమందికి నచ్చలేదు. మాటకి మాట చెప్పడం, ఓవర్ గా రియాక్ట్ అవ్వడం, ఏదైనా కౌంటర్ వేయగానే దాన్ని కట్ చేయడం, పుష్పలాగా బిహేవ్ చేస్తూ కావాలని వాంటెండ్ గా తెచ్చిపెట్టుకుని మాట్లాడటం అనేది కొంతమందికి నచ్చలేదు. ఆ తర్వాత చాలా విషయాల్లో ఏడ్చి సాధించుకున్నాడా అని కూడా అనిపించింది. సింపతీ బాగా వర్కౌట్ చేస్తున్నాడు. రైతుబిడ్డ అనేదాన్ని బాగా వాడుకుంటున్నాడు అని కూడా చాలామంది నెగిటివ్ గా మాట్లాడారు.
ఇక హౌస్ లో మనం చూసినట్లయితే, అందరితో జల్ అవ్వలేకపోయాడు. కేవలం శివాజీ, యావర్ ఇద్దరితో మాత్రమే ఉండగలిగాడు. మిగతా టైమ్ లో మిగతా వారితో మాట్లాడినా కూడా ఎక్కువ శాతం లేడు. అంతేకాదు, హౌస్ లో టాస్క్ లో ఆడటం, ఆ తర్వాత మాట్లాడకుండా సైలెంట్ గా ఒక మూల కూర్చోవడం ఇది కూడా ఒకరకంగా మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే, బిగ్ బాస్ కి (Bigg Boss 7 Telugu) కావాల్సిన పెప్పర్ కంటెంట్ రాలేకపోయింది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ కి కప్ ఇస్తారా.. తొక్కేస్తారా అనేది మాత్రం చాలా ఆసక్తికరం.