తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అవసరం లేని పేరు చియాన్ విక్రమ్.కెరీర్ ప్రారంభంలో ఆయన ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. కానీ ఆశించిన బ్రేక్ 20 ఏళ్ళ తర్వాత ‘శివ పుత్రుడు’ రూపంలో వచ్చింది. ఆ తర్వాత ‘అపరిచితుడు’ ‘నాన్న’ ‘ఐ’ ‘మహాన్’ వంటి చిత్రాలతో అతని క్రేజ్ భారీగా పెరిగింది. విలక్షణమైన పాత్రలు, విలక్షణమైన గెటప్ లతో విక్రమ్ ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తూ వస్తున్నాడు. కమర్షియల్ హీరో అయ్యుండి కూడా..
కమర్షియల్ సినిమాలకు దూరంగా ఎక్కువగా ఆఫ్ బీట్ సినిమాలే చేస్తుంటారు విక్రమ్. స్టార్ స్టేటస్ కు అతను సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి ఇష్టపడతాడు. అందుకే అభిమానులకు విక్రమ్ అంటే ప్రాణం. విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కోబ్రా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘కోబ్రా’ ప్రమోషన్లలో భాగంగా తిరుచ్చి వెళ్లింది చిత్ర బృందం.
దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు.విక్రమ్ కు స్వాగతం పలకడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. దీంతో అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి సీఐఎస్‌ఎఫ్ పోలీసులు వారిపై దాడికి దిగారు. వారిని తరిమి కొట్టడానికి ఓ రకంగా రూల్స్ బ్రేక్ చేశారు అనే చెప్పాలి. ఓ పోలీసు అయితే ఏకంగా విక్రమ్ అభిమానుల్ని కాలితో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో ఆ సీఐఎస్‌ఎఫ్ పోలీస్ ను సస్పెండ్ చేయాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టమైన హీరో వస్తే అభిమానులు అలాగే ముందుకు వస్తారు.. ఆ మాత్రం దానికి కాలు చేసుకోవడం ఏంటి అంటూ వాళ్ళు మండి పడుతున్నారు. ఈ విషయం పై విక్రమ్ కూడా స్పందించి బాధపడ్డాడు. ‘ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తడం తనని బాధ పెట్టినట్టు అతను పేర్కొన్నాడు. అభిమానులకు జరిగిన అసౌకర్యానికి తాను చింతిస్తూ క్షమాపణలు కోరాడు. వాళ్ళు నన్ను చూడటానికి రావడానికి నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి.’ అంటూ విక్రమ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు విక్రమ్.
அதே வேளையில் சில விரும்பதகா சூழல் ஏற்பட்டதாக என் கவனத்திற்கு வந்துள்ளது, அத்தகைய நிகழ்விற்கும், அசௌகர்யத்திற்க்கும் என் வருத்தத்தை பதிவு செய்து கொள்கிறேன். இங்கு இவரை யான் பெறவே என்ன தவம் செய்து விட்டேன். #CobraTrichy