Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు టీజర్ స్పెషాలిటీ ఇదే.. అలా ప్లాన్ చేశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్ (Krish Jagarlamudi) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీ షూటింగ్ నత్తనడకన సాగుతోందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అవుతున్నా సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావడం లేదు. అయితే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవుతున్నట్టు అకస్మాత్తుగా ప్రకటన వెలువడింది. మే నెల 2వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ టీజర్ విడుదల కానుంది.

ఈ టీజర్ కు పొలిటికల్ టచ్ ఉండబోతుందని అకస్మాత్తుగా టీజర్ రిలీజ్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో దర్శకుడు క్రిష్ పేరు లేకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది.

తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర ప్రధాన భాషల్లో ఈ టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ చెప్పిన గాజుగ్లాస్ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ సినిమాల నుంచి వరుసగా టీజర్లు రావడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నికలకు సరిగ్గా పది రోజుల ముందు హరిహర వీరమల్లు టీజర్ విడుదల కానుంది.

హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సినిమా సినిమాకు పవన్ కు క్రేజ్ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus