వచ్చే ఏడాది సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఎవరూ చెప్పలేకపోవచ్చు కానీ.. ఆ సినిమాలు ఏ ఓటీటీలో వస్తాయి అనే విషయంలో మాత్రం దాదాపు క్లారిటీ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి సినిమాలు ఒక్కోటి ఒక్కో ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక ఎప్పుడు స్ట్రీమ్ అవుతాయి అనే ప్రశ్నకు థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శనే సమాధానం ఇస్తుంది. తొలుత ఓటీటీలేంటో చూసేద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’.
శ్రీలల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి పండగ సంద్భంగా జనవరి 12న రిలీజ్ చేస్తారు అని టాక్. త్వరలో సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని చెబుతున్నారు. ఇప్పటికే రెండు పాటలు రాగా, కొత్తగా మూడో మాస్ పాట రానుంది. ఇక ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది అని సమాచారం. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘సైంధవ్’.
డిసెంబరు ఆఖరులో రావాల్సిన ఈ సినిమా ‘సలార్’ రాకపోత సంక్రాంతికి షిఫ్ట్ అయిపోయింది. ఓ ఎమర్జెన్సీ ఇంజిక్షన్ – పాప జీవితం అనే కాన్సెప్ట్‌లో రూపొందనున్న ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌లోనే తీసుకొస్తున్నారు. జనవరి 13న రానున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్‌కు వచ్చాయి అని చెబుతున్నారు. అయితే తొలుత ఈటీవీ విన్‌కు ఇచ్చారు అనే టాక్ కూడా వచ్చింది.
సంక్రాంతికే వస్తాం.. ఎట్టిపరిస్థితుల్లోనూ డేట్ మారేది లేదు అని పట్టుపట్టి మరీ కూర్చున్న చిత్రం (Hanuman) ‘హను – మాన్’. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాను వాయిదా వేయించాలని టాలీవుడ్ సీనియర్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా ఓ నిర్ణయం రాలేదు. అయితే ఓటీటీ విషయంలో మాత్రం నిర్ణయానికి వచ్చేశారట. జీ5లో ఈ సినిమా రిలీజ్ అవ్వొచ్చు అని సమాచారం. అయితే ‘నా సామి రంగా’, ‘ఈగిల్’ ఓటీటీల సంగతి తేలాల్సి ఉంది.