కొన్నేళ్ల క్రితం వరకు ఈజీగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో కొత్త సినిమా టికెట్ రేట్ల పెంపు అంటే.. తొలుత తెలంగాణ నుండే సమాచారం వచ్చేది. ఇక్కడి ప్రభుత్వం రేట్లు పెంచాక ఏపీ ప్రభుత్వం కొత్త రేట్లు చెప్పేది. ఆ తర్వాత ప్రభుత్వం చూపు మారినా.. టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వమే ముందు ఉండేది. అయితే రీసెంట్ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉందో లేదో తెలియడం లేదు.
Pongal
దీంతో ఏపీ నుండే తొలుత రేట్లు బయటకు వస్తాయ్ అంటున్నారు. టాలీవుడ్ నుండి ఏటా జరిగినట్లే ఈ సారి కూడా సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు మూడు వస్తున్నాయి. రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj), వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలు వరుసగా 10, 12, 14న రాబోతున్నాయి. దీంతో టికెట్ రేట్లను పెంచుకుని కాస్త క్యాష్ చేసుకుందామని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు ఖరారు అయ్యాయి అని సమాచారం.
సంక్రాంతి (Pongal ) సినిమాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలో జీవోలు జారీ అవుతాయి అని టాలీవుడ్‌లో టాక్. కొత్త రేట్ల ప్రకారం అయితే.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు మొదటి వారం ప్రస్తుత టికెట్ రేట్లపై రూ.135 నుండి రూ.175 అదనంగా పెంచేందుకు అనుమతి వచ్చిందని సమాచారం. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా విషయానికొస్తే.. రూ.110 నుండి రూ. 135 అదనంగా పెంచుకునే ఏర్పాటు చేస్తున్నారట. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.75 నుండి రూ.100 పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పిందని టాక్.
ఇవి కాకుండా బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్లు ఇస్తారని, అయితే అవి పరిమిత సంఖ్యలో ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే గతంలో తెలంగాణలో టికెట్ రేటు రూ. 395 వరకు పెంచుకునేలా ఓ లైఫ్ టైమ్ ఆర్డర్ గత ప్రభుత్వం ఇచ్చింది.