స్టార్ డైరెక్టర్ మణిరత్నం.. 4 దశాబ్దాలుగా తీయాలి అనుకుంటూ తీయలేకపోయిన.. ‘పొన్నియన్ సెల్వన్’ ను రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘పీఎస్-1 ‘ పేరుతో గతేడాది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా ఈ మూవీ డీసెంట్ హిట్ అందుకుంది. మిగిలిన భాషల్లో కూడా పర్వాలేదు అనిపించుకుంది. తమిళంలో మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ‘పీఎస్-1 ‘ మొదటి భాగానికి తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది.
‘పొన్నియన్ సెల్వన్’ అనేది తమిళ జనాలకు మాత్రమే అర్థమయ్యే కథ. పూర్తిగా అది వాళ్ళ నేటివిటీకి తగినది. అందుకే తెలుగు జనాలకు ఈ సినిమా ఎక్కలేదు. కానీ టెక్నికల్ గా ఈ సినిమాకి పేరు పెట్టనవసరం లేదు. దర్శకుడు మణిరత్నం ప్లస్ పాయింట్స్ లో ఇది కూడా ఒకటి. కానీ అతనికి ఇంకో బలం కూడా ఉంది. అదే ఎమోషన్. ‘పీఎస్-1 ‘ లో అది మిస్ అయ్యింది. కానీ ఓవరాల్ గా సినిమా గట్టెక్కేసింది. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం.
అయితే ‘పీఎస్-1 ‘ కి వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల రెండో పార్ట్ పై బజ్ ఏర్పడలేదు. ఏప్రిల్ 28 న ఈ చిత్రం విడుదలవుతుంది అని చాలా మంది జనాలకు తెలీదు. టాక్ బాగుంటే.. సినిమా కచ్చితంగా తెలుగులో కూడా ఆడుతుంది అని మేకర్స్ కూడా లైట్ తీసుకున్నారు. కార్తీ,విక్రమ్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్లు ఉన్నప్పుడు కచ్చితంగా ఓసారి చూడాలి అనుకునే జనాలు కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఫేక్ రివ్యూలు చెప్పే ఉమైర్ సంధు.. (Ponniyin Selvan 2) ‘పీఎస్ 2 ‘ కి రివ్యూ చెప్పాడు. ఎక్కువ సాగదీయకుండా ‘పీఎస్-2 ‘ సినిమా ‘బోరింగ్ అండ్ టార్చర్’ అంటూ ఇతను పేర్కొన్నాడు.’పీఎస్- 2 ‘ లో ప్రేక్షకులు ఆశించే ఎలిమెంట్స్ ఏమీ లేవని, ఈ సినిమా చూడాలనే ఆలోచన విరమించుకోవాలని’ అతను 2 రేటింగ్ ఇచ్చి వాంతి చేసుకుంటున్న ఎమోజి పెట్టాడు.