PS2: ‘పొన్నియన్ సెల్వన్ -2’ రిలీజ్ డేట్ ఫిక్స్..పెద్ద స్కెచ్చే ఇది?

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30న దసరా కానుకగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.రెండు భాగాలు కలుపుకుని రూ.500 కోట్ల బడ్జెట్ తో ‘పొన్నియన్ సెల్వన్’ ను రూపొందిస్తే.. మొదటి భాగమే రూ.500 కోట్లు వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక ‘పొన్నియన్ సెల్వన్ -1’ ను చూసిన వారంతా ‘పొన్నియన్ సెల్వన్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్ర బృందం ఆడియన్స్ కు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది.’పొన్నియన్ సెల్వన్ -2′ రిలీజ్ డేట్ ను రివీల్ చేసింది. రెండో భాగం 2023, ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ వీడియోని కూడా షేర్ చేసింది చిత్ర బృందం. సెకండ్ పార్ట్ లో ఆదిత్య కరికాలన్ (విక్రమ్), పొన్నియన్ సెల్వన్ (జయం రవి), వందయదేవన్ (కార్తి), నందిని (ఐశ్వర్యరాయ్ బచ్చన్) పాత్రలను ఈ వీడియోలో చూపించారు.

సెకండ్ పార్ట్ లో వీరి పాత్రలే కీలకం అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు కూడా పార్ట్ 1 లో హింట్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ ను చాలా సస్పెన్స్ అంశాలతో ఎండ్ చేశారు. పార్ట్ 2 వాటన్నిటికీ క్లారిటీ ఇస్తారని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 28న మహేష్ బాబు – త్రివిక్రమ్ ల మూవీ కూడా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. ‘పొన్నియన్ సెల్వన్ -2’ కూడా అదే డేట్ కు రిలీజ్ అవుతుంది

అని ప్రకటన రావడంతో మహేష్ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. ఆ సినిమాకి పోటీగా రిలీజ్ అయితే మహేష్ సినిమాకు పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే మహేష్ – త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఒక షెడ్యూల్ ను నామమాత్రంగా స్టార్ట్ చేశారు కానీ… అది యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే..! కాబట్టి.. మహేష్ – త్రివిక్రమ్ ల సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని.. ‘పొన్నియన్ సెల్వన్ -2’ ప్రకటన ద్వారా స్పష్టమవుతుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus