PS1 Trailer: పాత్రల పరిచయానికే సరిపోయిందిగా..!

మణిరత్నం డ్రీం ప్రాజెక్టు అయిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కు సంబంధించిన టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. దానికి అంతగా మంచి రెస్పాన్స్ రాలేదు. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. చోళుల స్వర్ణయుగాన్ని ప్రేక్షకులకు గ్రాండ్ గా చూపించాలి అనే దర్శకుడి తాపత్రయం ఈ ట్రైలర్లో కనిపించింది.విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత ధూళిపాళ వంటి క్రేజీ నటీనటులు నటిస్తున్న చిత్రమిది.

‘లైకా ప్రొడక్షన్స్’, ‘మద్రాస్ టాకీస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా మంగళవారం నాడు రాత్రి రజనీకాంత్, కమలహాసన్ వంటి స్టార్లు ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే… “వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణ శకం ఉదయించక మునుపు ఒక తోక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ, రాజ కులంలో ఒకరిని ఆ తోకచుక్క బలిగోరుతుందంటున్నారు జ్యోతిష్యులు.

దేశాన్ని పగలు, ప్రతీకారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. వంచన.. ద్రోహం రాజమందిరంలోకి చొచ్చుకుపోతున్నాయి” అంటూ రానా వాయిస్ ఓవర్లో ట్రైలర్ మొదలైంది.ట్రైలర్ చాలా గ్రాండియర్ గా ఉంది. విక్రమ్ ఆదిత్య కరికాలన్ గా, అతని సోదరుడు అరుల్ మొళి వర్మన్ చోళ రాజ్యాధికారం స్వీకరించడానికి ముందున్న గందరగోళ పరిస్థితులను.. రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు శత్రుమూకలు చేసిన ప్రయత్నాల్ని ఈ ట్రైలర్లో చూపించారు. అరుల్ మొళివర్మన్ (రాజరాజచోళుడు)గా జయం రవి కనిపిస్తున్నారు.

కార్తీ.. పల్లవ రాయ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొత్తం గ్రాండియర్ గానే కనిపించింది. చోళులు, పాండ్యులు గురించి ఎక్కువగా తమిళ జనాలకే తెలుసు. తెలుగు జనాలకు తెలీదు. కానీ మణిరత్నం తన మార్క్ టేకింగ్ తో అన్ని భాషల ప్రేక్షకులకు అర్ధమయ్యేలా కథని చెప్పగలరు. కానీ ‘పొన్నియన్ సెల్వన్-1’ ట్రైలర్ మాత్రం గందరగోళానికి గురి చేసే విధంగా ఉంది. ఆయన మార్క్ ఎమోషన్ ట్రైలర్లో కనిపించలేదు. ఒకవేళ సినిమాలో కనిపిస్తుందేమో చూడాలి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus