అమ్మాయిలకు నాన్న తొలి హీరో. చిన్నతనం నుండి తండ్రినే సూపర్‌స్టార్ అనుకుంటూ ఉంటారు. ఆ మాటకొస్తే పిల్లలు ఎవరికైనా తండ్రే మొదటి హీరో అని చెప్పొచ్చు. అలాంటి తండ్రి గురించి.. ఫాదర్స్ డే రోజు హీరోయిన్లు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం ఈ సీరియల్ ఆఫ్ ఆర్టికల్స్. ఇందులో భాగంగా నలుగురు హీరోయిన్లు తమ తండ్రి గురించి ఏమనుకుంటున్నారో చెబుతాం. అందులో తొలుత చెప్పుకునే హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. పూజా హెగ్డే నాన్న పేరు మంజునాథ హెగ్డే.
కర్ణాటకలో న్యాయవాదిగా చేస్తున్నారు. చిన్నప్పటి నుండ్రి తండ్రినిని పూజ చాలా తక్కువగానే సీరియస్‌గా చూసిందట. కారణం మంజునాథ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉండటమే. ఊహ తెలిసినప్పటి నుండి, ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నవరకు అంటే ఇప్పటివరకు మా నాన్న లాంటి వ్యక్తిని అస్సలు చూడలేదు అని చెబుతోంది పూజ. చిన్నతనంలో మంజునాథ్ పూజను, ఆమె అన్నయ్య రిషభ్ హెగ్డేను కూర్చోబెట్టుకుని రకరకాల కథల్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పేవారట.
ఎప్పుడూ జోకులు వేస్తూ ఉండేవారట. అలా చాలామంది లాగే పూజకు వాళ్ల నాన్నతో చెప్పలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయట. ఎంత పెద్ద సమస్య వచ్చినా… నవ్వుతూనే పరిష్కరించుకుంటారు తప్ప బాధ, కోపం లాంటివి మంజునాథ ముఖంలో కనిపించలేదని పూజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. తన తండ్రి నుండి ఏదైనా వారసత్వంగా తీసుకోవాలి అనుకుంటే అది ఆయన హ్యూమర్‌నే అని చెబుతోంది పూజ. చిన్నప్పటి నుండి తండ్రిని చూస్తూ పెరిగిన పూజా కెరీర్‌లో ఎదగడానికి ఆయన్నే ఆదర్శంగా తీసుకుందట.
సినిమా హీరోయిన్ అయ్యాక, అంతకుముందు మోడల్‌గా ఉన్నప్పుడు… ఎంత పని ఉన్నా, వరుస షూటింగ్‌లతో రెస్ట్ లేకపోయినా… ఒత్తిడికి గురికాకుండా చూసుకుంటుందట. అందుకే పాన్ ఇండియా హీరోయిన్‌గా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో ఏక కాలంలో సినిమా షూటింగ్‌లు చేసింది. ఎక్కడా ఆలస్యం కాకుండా పక్కాగా ప్లానింగ్ చేసుకుని సినిమాలు చేస్తోంది. ఇదంతా తన తండ్రి నేర్చుకున్న టాలెంటే అని చెప్పింది పూజ. ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా, పవన్ కల్యాణ్ ‘భవదీయుడు భగత్‌సింగ్’తోపాటు బాలీవుడ్ సినిమాలున్నాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!