టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందిన పూజా హెగ్డే (Pooja Hegde) , గత కొంతకాలంగా వరుస పరాజయాలతో తడబడుతోంది. ‘రాధే శ్యామ్’ (Radhe Shyam), ‘ఆచార్య’ (Acharya) వంటి భారీ సినిమాలు బోల్తాపడటంతో టాలీవుడ్ లో ఆమె క్రేజ్ తగ్గింది. ఇక బాలీవుడ్ లోనూ పరిస్థితి మెరుగ్గా లేదు. ఇటీవల షాహిద్ కపూర్ తో చేసిన ‘దేవా’ (Deva) సినిమాతో మరో డిజాస్టర్ ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో అవకాశాలు తక్కువగా ఉండటంతో తమిళ ఇండస్ట్రీపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం కోలీవుడ్ లో పూజా చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా సూర్య నటిస్తున్న ‘రెట్రో’ (Retro) సినిమాపై బజ్ మరింత పెరిగింది. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా డీ గ్లామర్ లుక్ లో కనిపించనుందట. టీజర్ చూస్తే, ఆమె పాత్రను పూర్తి కొత్తగా డిజైన్ చేసినట్టు అర్థమవుతోంది. ఇదే కాకుండా తలపతి విజయ్ (Vijay Thalapathy) ‘జన నాయగన్’ (Jana Nayagan) లోనూ హీరోయిన్ గా ఎంపికైంది. విజయ్ తో ‘బీస్ట్’ (Beast) లో జోడిగా నటించినప్పటికీ, మరోసారి ఈ కాంబినేషన్ కుదిరింది.
లారెన్స్ (Raghava Lawrence) భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’ లోనూ పూజా హెగ్డే లాక్ అయిపోయింది. ఇది హారర్ బ్యాక్‌డ్రాప్ లో ఉండే చిత్రమని, ఇందులో ఆమె పాత్రకు కొత్త తరహా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. రెగ్యులర్ గ్లామర్ రోల్స్ కి భిన్నంగా, ఈ సినిమాలో ఆమె పాత్రలో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. అందులోని అన్ని ప్రాజెక్ట్స్ ఒక ఎత్తు అయితే, రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న ‘కూలి’ (Coolie) లోనూ పూజా హెగ్డే భాగమైనట్టు తాజాగా అధికారికంగా వెల్లడించారు. ఈ విషయంపై పది రోజుల ముందే లీక్ అయిన్నప్పటికీ, ఇప్పుడు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇందులో ఆమె పాత్ర ఐటెం సాంగ్ తో కూడిన క్యామియో పాత్ర అని చెబుతున్నారు. రజని, నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra) అమీర్ ఖాన్ (Aamir Khan) లాంటి స్టార్లు ఉన్న మల్టీస్టారర్ లో అవకాశం రావడం చిన్న విషయం కాదు. ఇక టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు లేకపోవటమే కారణమా? లేక కోలీవుడ్ వైపు ఆమెకే ఆసక్తి పెరిగిందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలుగులో వచ్చిన కొన్ని ప్రాజెక్ట్స్ కి పూజా నో చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ తమిళ లైనప్ తో అమ్మడి కెరీర్ లో ఎలాంటి హిట్స్ పడతాయో చూడాలి.