Pooja Hegde: అద్దాల మేడలా పూజా హెగ్డే ఇల్లు.. ఇల్లు ఎంత బాగుందో చూడండి..!

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ముద్దుగా బుట్ట బొమ్మ అని పిలుచుకునే ఈమె.. తెలుగు, తమిళ, హిందీ భాషల సినిమాల్లో నటించి సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కన్నడ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. యష్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పాన్ ఇండియా సినిమాని రూపొందించాలి అంటే దర్శకనిర్మాతలు అందరూ పూజా హెగ్డే నే సంప్రదిస్తున్నారు

అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా రికార్డులకెక్కిన పూజా హెగ్డే.. ఇంటిని చూడాలి అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇంటిని అభిమానులకు పరిచయం చేసింది. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్తో రూపొందించిన తన ఇంటిని చూపిస్తూ పూజా హెగ్డే ఓ వీడియో చేసింది. ఏషియన్ పెయింట్స్ ‘వేర్ ది హార్ట్ ఈజ్ సీరీస్’ వీడియోలలో భాగంగా పూజా తన ఇంటిని ‘ట్రైలర్’ రూపంలో చూపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది.

‘నా తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారు. మా నాన్న ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చి పని ఒత్తిడిని ఎప్పుడు తీసుకురాలేదు. ఆయన ఒక చిన్నపిల్లాడిలా మాతో ఆటలు ఆడేవారు. దానికి ప్రధాన కారణం మా ఇంటి వాతావరణం’ అంటూ పూజా హెగ్డే ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus