సినిమా ఇండస్ట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటే మాత్రమే హీరోయిన్లకు గోల్డెన్ లెగ్ ఇమేజ్ దక్కుతుందనే సంగతి తెలిసిందే. అలా గోల్డెన్ లెగ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు కాగా ఈ ఏడాది పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కి విడుదలైన పెద్ద సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల ఫలితాల వల్ల పూజా హెగ్డే ఇమేజ్ కూడా కొంతమేర తగ్గింది.
అయితే ఈ సినిమాలు ఫ్లాపైనా ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండగా పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది.
రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలలో పూజా హెగ్డే నటిస్తుండగా ఈ సినిమాలు పూజా హెగ్డే జాతకాన్ని మారుస్తాయేమో చూడాల్సి ఉంది. పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా పూజా హెగ్డేకు సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం. నటన విషయంలో పూజా హెగ్డేపై విమర్శలు ఉన్నా కొందరు స్టార్ డైరెక్టర్లు ఆమెకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.
పూజా హెగ్డే తమిళంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆ కోరిక నెరవేరడం లేదని సమాచారం అందుతోంది. బీస్ట్ సినిమా ఫలితంతో పూజా హెగ్డేకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పూజా హెగ్డే కథల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.