Pooja Hegde: కొత్తింట్లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ!

కర్ణాటకకు చెందిన ముద్దుగుమ్మ పూజాహెగ్డే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తన కలను నెరవేర్చుకోవడం కోసం ఏడాదిగా ఆమె కష్టపడుతుందట. ఎట్టకేలకు అది నిజమైందంటూ రాసుకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ తో పాటు నార్త్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది పూజాహెగ్డే. ఈ బ్యూటీకి చాలా రోజులుగా ముంబైలో ఓ ఇల్లు కట్టుకోవాలని కల. దానికోసం కోట్ల రూపాయలు కావాలి. హీరోయిన్ గా స్టార్ డం తెచ్చుకున్న తరువాత పూజాకి కోట్లలో రెమ్యునరేషన్ వస్తోంది.

దీంతో ముంబైలో ఓ స్థలం కొని ఇంటిని నిర్మించుకుంది. ఏడాదిగా ఆ ఇంటి నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటుంది. ఫైనల్ గా అన్ని పనులు పూర్తయ్యాయి. రీసెంట్ గా తన కొత్తింట్లోకి పూజా గృహప్రవేశం కూడా చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది పూజా. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు, కొందరు సెలబ్రిటీలు పూజాహెగ్డేకి కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తోంది. నిజానికి సంక్రాంతికి ఆమె నటించిన ‘రాధేశ్యామ్’ విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అలానే ఈ బ్యూటీ నటించిన ‘ఆచార్య’, ‘బీస్ట్’ లాంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. హిందీలో ఈ బ్యూటీ ‘సర్కస్’ అనే సినిమాలో నటిస్తోంది. మరికొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus