Pooja Hegde: ఆ సినిమా చేయడం వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్లు రాలేదు: పూజా హెగ్డే

పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోల సరసన ఆఫర్లు అందుకుంటుంది. మలయాళంలో కూడా పలు పెద్ద సినిమాల్లో ఈమెకు ఛాన్స్ లు వస్తున్నాయి అని వినికిడి. అలాగే బాలీవుడ్లో కూడా ఈమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి అన్న సంగతి తెలిసిందే. సౌత్ నుండీ ఎక్కువ పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డేనే. అయితే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నుండీ వచ్చిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌ వంటి చిత్రాలు నిరాశపరిచాయి.

ఆమె స్పెషల్ సాంగ్ చేసిన ‘ఎఫ్3’ కూడా అంతంత మాత్రమే ఆడింది.అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమీ తగ్గడం లేదు. పారితోషికం కూడా ఆమె అడిగినంత ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యనే ‘జన గణ మన’ చిత్రం కోసం పూజని సంప్రదించగా.. ఆమె రూ.4 కోట్లు డిమాండ్ చేసింది. అయినా ఆమె అడిగినంత ఇచ్చేసారు. ప్రస్తుతం ఆమె హిందీలో సల్మాన్‌ ఖాన్‌ ‘కభీ ఈథ్‌ కభీ దివాలీ’ ‘సర్కస్‌’ వంటి చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఆమె బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ… ‘తెలుగులో నేను నటించిన 6 సినిమాలు వరుసగా హిట్‌ అవ్వడం నా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అనుకోవచ్చు. ఇక ఫెయిల్యూర్స్ గురించి చెప్పుకోవాలి అంటే నా బాలీవుడ్ డెబ్యూ(మొహంజోదారో) ఘోరపరాజయం పాలవ్వడం అని చెప్పాలి. నా కెరీర్‌లో అదో చెత్త సినిమాగా మిగిలిపోయింది.ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్‌ లేవు’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది. పూజ కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus