Pooja Hegde: తన బిల్లు తానే కట్టాలని పూజా హెగ్డే కు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ?

పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు.దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె తన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న బుట్టబొమ్మ పూజా హెగ్డేకు తాజాగా ఒక బడా నిర్మాణ సంస్థ నుంచి చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

రెమ్యూనరేషన్ కాకుండా తనతో పాటు తన స్టాప్ కి అయ్యే ఖర్చులను కూడా నిర్మాణ సంస్థ భరించాలని ఈమె ముందుగా అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయకపోవడంతో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టపోయారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం పూజ హెగ్డే తన స్టాప్ ఖర్చులు సుమారు కొన్ని లక్షలు వచ్చాయి. సినిమా ఫ్లాప్ కావడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిర్మాతలకు ఈమె ఖర్చులు మరింత భారంగా మారాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చును తానే కట్టుకోవాలి అంటూ బిల్లు పేపర్లను తనకు పంపినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ విధంగా పూజా హెగ్డే పారితోషికమే కాకుండా ఈమె ఖర్చులను కూడా భరించాలి అంటే నిర్మాతలకు కష్టతరంగా మారుతోందని కొందరు నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన తన స్టాఫ్ ఖర్చులు నిర్మాతలకు భారంగా మారుతుందని నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె నటించిన వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈమె మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus