SSMB28: పూజాహెగ్డేకి షాకిచ్చిన త్రివిక్రమ్..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది పూజాహెగ్డే. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి ఏదీ కలిసి రావడం లేదు. వరుస ప్లాప్ లతో డీలా పడింది. దీంతో ఆమెకి అవకాశాలు కూడా తగ్గాయి. చేతిలో ఒకట్రెండు సినిమాలు తప్ప.. పెద్దగా ఆఫర్లు లేవు. ప్రస్తుతం ఈమె మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

ఆమె మరెవరో కాదు శ్రీలీల. ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తరువాత ‘ధమాకా’తో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వంద కోట్ల గ్రాసర్ ని సాధించడంతో పాటు హీరోయిన్ గా శ్రీలీలకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో ఆమెకి అవకాశాలు పెరిగిపోయాయి. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమెని తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఆమెని ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కాబట్టి ఆడియన్స్ తెరపై ఆమెని స్పెషల్ గా చూడాలనుకుంటారు. కాబట్టి దానికి తగ్గట్లే మహేష్ బాబు సినిమాలో సీన్లు రాసుకుంటున్నారట. మహేష్, శ్రీలీల కాంబినేషన్ లో పక్కా ఒక ఫోక్ సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారట. ‘ధమాకా’ సినిమాలో దండకడియాల్, పల్సర్ బైక్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదే రేంజ్ లో మహేష్ సినిమాలో సాంగ్ ఉంటే.. శ్రీలీల పెర్ఫార్మన్స్ మరో రేంజ్ లో ఉంటుంది. అందుకే దానికి తగ్గట్లే ప్లాన్ చేస్తున్నారు. మొదటి నుంచి సినిమాలో తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భావించిన పూజాహెగ్డే.. ఇప్పుడు మారిన స్క్రిప్ట్ లో శ్రీలీలకి ఎక్కువ స్కోప్ ఉండడం చూసి హర్ట్ అవుతుందట. ఆ విషయాన్ని బయటకు చెప్పలేక లోలోపల తెగ ఫీల్ అయిపోతుందట. మరి సినిమాలో శ్రీలీల ఎలా చూపిస్తారో చూడాలి!

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus