Poonakaalu Loading: అంత బిల్డప్ ఇచ్చారు.. ఇలా ఉందేంటి.. దేవి సరిపోడా… మళ్ళీ ఆ రోల్ రైడా కూడానా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ నుండి 4 వ పాట రిలీజ్ అయ్యింది. ‘బాస్ పార్టీ’ ‘శ్రీదేవి చిరంజీవి’ ‘వీరయ్య’ వంటి పాటలు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ‘పూనకాలు లోడింగ్’ అనే పాట కూడా రాబోతుంది అని టీం చెప్పినప్పుడు చాలా మంది ఈ పాట అదిరిపోతుంది అని.. ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ లో ఇది బెస్ట్ సాంగ్ అవుతుంది అని అంచనా వేశారు. మరి తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

ముందుగా ‘ఈ పూనకాలు లోడింగ్’ పాటకు కూడా లిరిక్స్ అందించింది దేవి నే కావడం విశేషం. అయితే కాన్సెప్ట్ ను మాత్రం ప్రముఖ ర్యాపర్,బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ అయిన రోల్ రైడా డిజైన్ చేశాడట. ట్యూన్ బాగానే ఉంది. ఈ పాట చిరు- రవితేజ కాంబినేషన్లో చిత్రీకరించారు. ఇద్దరూ కలిసి ఈ పాటలో డాన్స్ చేస్తున్నట్లు తెలిపి ముందు నుండి ఈ పాట పై హైప్ ఏర్పడేలా చేశారు. అదీ బాగానే ఉంది.

చిరు – రవితేజ కలిసి మాస్ డాన్స్ చేస్తే చూడాలి అని ఎవరు మాత్రం కోరుకోరు.పైగా ఇద్దరూ తమ గొంతులు కూడా కలిపారు. కానీ ఈ పాట ఏమాత్రం క్యాచీగా లేదు. గందరగోళానికి గురి చేసే విధంగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ కొన్నాళ్ళు తాను కంపోజ్ చేసే పాటలకు లిరిక్స్ అందించడం మానేస్తే బాగుంటుంది. దేవి సరిపోడా అనుకుంటే ఈ పాటకు రోల్ రైడాని కూడా తగిలించి పెద్ద తప్పు చేశారు అనిపిస్తుంది.

సినిమా వేడుకల్లో అతని గురించి ఎంత మంది మొహమాటానికి పొగిడినా అతని ‘పర పర పర పప్పరలు’ అందరికీ తెలిసినవే. ఈ పాట డిజైనింగ్ కూడా అలాగే ఉంది. అయితే సినిమా చూస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి ఈ పాట ఎక్కే అవకాశం కొంత వరకు ఉంది. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యే అవకాశం మాత్రం లేదు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా రిలీజ్ కాబోతుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus